జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలను ప్రభావితం చేసినట్లు కానీ రాజకీయాలను ప్రభావితం చేయడానికి జనసేన పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో మాత్రం తన సత్తా చాటిలేక  పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమిపాలయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇకపోతే ఎన్నికల్లో  ఓడిపోయినప్పటికీ అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా  ఆంధ్ర రాజకీయాల్లో  దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కంటే ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే జనసేన పార్టీ తెలంగాణలో ఉందన్న విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా జనసేన పార్టీ నేతలు ఉన్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్ర రాజకీయాలకే పరిమితం అయ్యారు. తెలంగాణలోని జనసేన నేతలతో సమావేశం అయింది మాట్లాడింది మాత్రం లేదు. 

 


 అయితే తెలంగాణలో ప్రభుత్వానికి  వ్యతిరేకంగా ఏర్పాటు కాబోతున్న ఓ భారీ బహిరంగ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్లు  తెలుస్తోంది. జనవరి 5న ఉస్మానియా యూనివర్సిటీ లో జరుగుతున్న జనసేన విద్యార్థి గర్జన భారీ బహిరంగ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఈ విషయాన్ని జనసేన తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు.. జేఏసీ నాయకులు తెలిపారు. అయితే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన  పార్టీ నేతలను బరిలోకి దింపుతాడా  అనే కొత్త చర్చ కూడా మొదలైంది. 

 

 

 అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల గురించి అంతగా పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారీ బహిరంగ సభకు వచ్చే అవకాశాలున్నాయని తెలియడంతో... తెలంగాణ రాజకీయాల్లో  ఎంతో ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా పలుమార్లు కేటీఆర్ కెసిఆర్ పై విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు భారీ బహిరంగ సభకు హాజరవుతున్న గా... పవన్ కళ్యాణ్ సభ వేదికగా ఏమైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నరా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: