వచ్చేనెలలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కొత్త మార్పులు వచ్చాయి.. ఇద్దరికి మించి సంతానమున్న వారు వార్డులు/డివిజన్లలో పోటీచేసేందుకు అర్హులే.అంతకుముందు ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండేదికాదు.. కాని ఇపుడు అ నిబంధన పూర్తిగా ఎత్తివేయడంతో ఎన్నికలలో కొత్త మార్పులు వచ్చాయి.. అధికారులు కూడా అ మార్పులకు  సంబందించిన పనులను వేగవంతం చేస్తున్నారు.ఇద్దరి పిల్లల కన్న ఎక్కువ ఉన్న మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని స్పష్టం చేసింది 

 

 

ఇదే విషయాన్నీ తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) కూడా స్పష్టతనిచ్చింది.అలాగే అంగవైకల్యం గల  చెవిటి, మూగ లేదా కుష్ఠు వ్యాధితో బాధపడుతుంటే అటువంటి వారు గతంలో పోటీకి అనర్హులుగా ఉండగా కొత్తచట్టంలో ఆ నిబంధనను తొలగించారు. అదేవిధంగా అవినీతి పద్ధతులు లేదా ఎన్నికల అక్రమాల కారణంగా (9ఏ చాప్టర్‌ ప్రకారం) శిక్షపడిన వారికి గతంలో పోటీకి అర్హత లేకపోగా, కొత్తచట్టంలో దానిని తొలగించారు.అంగవైకల్యం ఉన్న గాని ఎలక్షన్స్ లో పోటీ చేయవచ్చు. 

 

 

ఈ విషయాన్ని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (జీహెచ్‌ఎంసీ మినహా), అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు, కార్పొరేషన్ల ఆర్‌వోలు, పీవోలకు ఇదివరకే ఒక నోటిఫికేషన్‌ ద్వారా ఎస్‌ఈసీ తెలియజేసింది.మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారం, ర్యాలీల నిర్వహణకు ఇకపై విద్యాసంస్థలు (ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ ఏవైనా), వాటి మైదానాలు ఉపయోగించే వీలు లేదు.

 

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ప్రచార సమయంలో ప్రభుత్వ,ప్రైవేట్‌ స్థలాల గోడలపై పోస్టర్లు అంటించడం, ప్రకటనలు రాయడం లాంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఈ ఆస్తుల యజమానులకు నష్టం కలుగుతుందని ఎలక్షన్ కమిటీ నిర్ణయం. గోడల మీద అనవసరమయిన పోస్టర్స్ అతికించరాదని తేల్చి చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: