ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు మరోసారి ప్రమాదం తప్పింది. అష్కెలాన్‌లో ఎన్నికల ప్రచారంలో ఉండగా.. రాకెట్ ప్రయోగం జరిగినట్లు సైరన్ మోగడంతో.. స్టేజిమీదున్న ప్రధానిని హుటాహుటిన సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీన్ని తమ రక్షణ వ్యవస్థ గాల్లోనే కూల్చివేసినట్లు .. ఇజ్రాయెల్ సైనిక వర్గాలు తెలిపాయి.

 

ఇజ్రాయెల్.. 20వ శతాబ్ధంలో అమేయ సైనికశక్తికి ప్రతీక. నాలుగు వైపులా శత్రుదేశాలు పొంచి ఉన్నప్పటికీ.. అన్నింటికీ ఏకకాలంలో సమాధానాలు చెప్పగల గట్స్ ఉన్న దేశం. పశ్చిమాసియాలో అమెరికాకు కుడిభుజం. గల్ఫ్ దేశాలను.. తన సైనిక శక్తితో నిలువరిస్తోంది.  ఇజ్రాయెల్‌ను ఆక్రమించాలని ఎన్నోసార్లు ప్రయత్నించి భంగపడ్డి గల్ఫ్ , ప్రధానంగా టర్కీ, ఇరాన్ తదితర దేశాలు.. అదనుచూసి రాకెట్ దాడులకు తెగబడుతున్నాయి. ఇజ్రాయెల్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆదేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు లక్ష్యంగా.. ఓ రాకెట్ దాడి జరిగింది. అయితే సైరన్ మోగడంతో.. అప్రమత్తమైన ఇజ్రాయెల్ రక్షణ అధికారులు.. ప్రధాని దంపతులను సురక్షిత ప్రదేశానికి తరలించారు.

 

గతంలో కూడా ఓసారి  బెంజమిన్ నెతన్యాహు లక్ష్యంగా చేసుకుని.. హమాస్ రాకెట్ సంధించింది. అయితే అప్పుడు కూడా సైరన్ మోగడంతో.. నెతన్యాహు ప్రాణాలతో బయటపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధానిని హతమార్చి, ఆ దేశంలో కల్లోలం సృష్టించాలన్నది .. ఉగ్రవాదుల లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ విషయంలో ముందస్తు చర్యలు తీసుకున్న ఇజ్రాయెల్.. తన దేశ రక్షణకు ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీంతో దేశంపైకి పొరుగు దేశాల నుంచి వస్తున్న దాడులను సమర్థంగాఎదుర్కొంటూ.. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తోంది.

 

ఐరన్ డోమ్.. ఇజ్రాయెల్ తయారీ రక్షణ వ్యవస్థ. దీన్ని సులభంగా ఎక్కడికైనా తరలించొచ్చు. తొలుత 4 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల రేంజ్‌లోని శత్రు క్షిపణులను కూల్చివేసేందుకు.. ఇజ్రాయెల్ తయారుచేసింది. ప్రస్తుతం 70 నుంచి 250 కిలోమీటర్లకు  దీని రేంజ్ పెంచే ప్రయత్నాల్లో ఉంది. ప్రపంచంలో ఉన్న అత్యాధునిక రక్షణ వ్యవస్థల్లో ఇది ఒకటి. ఇది వేర్వేరు డైరెక్షన్ల నుంచి వచ్చే క్షిపణులను ఏకకాలంలో కూల్చివేయగలదు. ఇప్పటికి ఈ వ్యవస్థ గాజా నుంచి జరిగిన 1600 రాకెట్ దాడుల నుంచి ఇజ్రాయెల్ ను  కాపాడింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: