ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మీద వైసిపి ఎంఎల్ఏ తోపుదర్తి ప్రకాష్ రెడ్డి పెద్ద సెటైర్ వేశారు. చంద్రబాబునాయుడు, వేమూరి రాధాకృష్ణ, రామోజీరావు కనిపిస్తున్న మూడు పసుపు  సింహాలైతే కనిపించని నాలుగో పసుపు  సింహమే వెంకయ్యనాయుడని తోపుదర్తి చెప్పారు. తోపుదర్తి చెప్పారని కాదుకానీ వెంకయ్య ఏ స్ధాయిలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన గుండె చప్పుడు మొత్తం చంద్రబాబు కోసమే అన్న విషయం అందదరికీ తెలిసిందే.

 

వెంకయ్య రాష్ట్రంలో ఉన్నా కేంద్రంలో ఉన్న చివరకు ప్రతిపక్షం, అధికారపక్షం అన్న తేడా కూడా చూడరు. ఏ సమయంలో అయినా చంద్రబాబు ప్రయోజనాల పరిరక్షణకే వెంకయ్య నిరంతరం తపిస్తుంటారన్న విషయం ఎన్నోసార్లు బయటపడింది.  కేంద్రమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలోని బిజెపి పార్టీ ప్రయోజనాలను కూడా చంద్రబాబు కోసం పణంగా పెట్టేశారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి.

 

పార్టీని ఎదగనీయకుండా నేతలను ఎవరినీ చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరెత్తనీయకుండానే చాలాకాలం కట్టడిచేశారు. అయితే వెంకయ్య విషయాన్ని, చంద్రబాబు పరిరక్షణకోసం పని చేస్తున్న విషయాన్ని రాష్ట్ర బిజెపిలోని కొందరు నేతలు నేరుగా మోడి, అమిత్ షాలకే ఫిర్యాదు చేసినట్లు కూడా ఆమధ్య వార్తలు వినిపించాయి. సరే కారణాలు ఏవైనా వెంకయ్యను  క్రియాశీల రాజకీయాల నుండి మోడి బలవంతంగా బయటపకు పంపేశారు.

 

రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉన్న వెంకయ్యను మోడి బలవంతంగా ఉపరాష్ట్రపతిగా పంపేయటం అప్పట్లో సంచలనంగా మారింది. ఎందుకంటే ఉపరాష్ట్రపతిగా వెళ్ళటం, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండటం తనకు ఇష్టం లేదని వెంకయ్య మీడియాలోనే బహిరంగంగా చెప్పటం కలకలం రేపింది. అయినా కానీ మోడి వెంకయ్య మాటలను పట్టించుకోలేదు. దాంతో అప్పటి నుండే వెంకయ్య-చంద్రబాబు బంధానికి కాస్త బ్రేకులు పడ్డాయి.

 

దాని తర్వాతే చంద్రబాబు-మోడి మధ్య విభేదాలు, టిడిపి ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయటం తర్వాత ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం అందరికీ తెలిసిందే.  తన కళ్ళ ముందే చంద్రబాబు పునాదులు కదిలిపోతున్నా, టిడిపి మేడలు కూలిపోతున్నా ఏమి చేయాలని నిస్సహాయస్దితిలో వెంకయ్య చూస్తుండిపోయారు. ఆ కోపంతోనే  చివరకు ఉపరాష్ట్రపతిగా ఉండి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: