ఇళ్లు, ఆఫీసుల విష‌యంలో... ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో దేశవ్యాప్తంగా గృహ విక్రయాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 6 శాతం పెరిగి 46,920 యూనిట్లకు చేరుకున్నట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్‌ తాజాగా వెల్లడించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో చదరపు అడుగు ధర రూ.4,600 స్థాయిలో ఉన్నది. అలాగే అమ్ముడుపోని ఇన్వెంటరీ 6 శాతం తగ్గి 1,86,714 యూనిట్ల నుంచి 1,75,079 యూనిట్లకు పడిపోయాయి. మిగత ఏడు నగరాల్లో నికరంగా చూస్తే అమ్మకాలు ఐదు శాతం పెరిగి 2,61,370 లకు చేరుకున్నాయి. రెండో అర్థభాగంలో విక్రయాలు 22 శాతం తగ్గుముఖం పట్టా యి. మిగతా నగరాల విషయానికి వస్తే ముంబైలో ఇండ్ల అమ్మకాలు 22 శాతం పెరుగగా, పుణెలో 18 శాతం, చెన్నైలో 4 శాతం అధికమవగా, కానీ, బెంగళూరుల్లో 12 శాతం పతనం చెందాయి. అలాగే కోల్‌కతా, హైదరాబాద్‌లో అమ్మకాల్లో 11 శాతం దిగువకు పడిపోయాయి.

 


మ‌రోవైపు, దేశవ్యాప్తంగా ఆఫీస్‌ స్థలం హాట్‌కేక్‌లా మారిపోయింది. ప్రస్తుత సంవత్సరంలో ఏడు మెట్రో నగరాల్లో 4.65 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఒక సంవత్సరంలో ఇంతటి స్థాయిలో లీజుకు తీసుకోవడం ఇదే తొలిసారి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 40 శాతం అధికమని ప్రాపర్టీ కన్సల్టెన్సీ జేఎల్‌ఎల్‌ ఇండియా వెల్లడించింది. వ్యాపారాన్ని భారీగా విస్తరించడానికి కార్పొరేట్‌ సంస్థలు మొగ్గుచూపడం, ఐటీ/ఐటీఈఎస్‌ సంస్థల నుంచి అధిక డిమాండ్‌ ఉండటం వల్లనే భారీ వృద్ధి నమోదైందని తెలిపింది. 2018లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, పుణె, కోల్‌కతాలలో 3.32 కోట్ల చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నారు. భారతీయ ఆఫీస్‌ మార్కెట్‌ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నదని, ప్రస్తుత సంవత్సరంలో 4.65 కోట్ల చదరపు అడుగులు అద్దెకు తీసుకోగా, గరిష్ఠంగా 5.2 కోట్ల చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన స్థలానికి డిమాండ్‌ నెలకొన్నదని తెలిపింది. అలాగే సరఫరా కూడా 45 శాతం పెరిగి 5.16 కోట్ల చదరపు అడుగులకు చేరుకున్నది. గతేడాది ఇది 3.57 కోట్ల చదరపు అడుగులుగా ఉన్నది. కాగా, ఖాలీ స్థలాలు 13 శాతం మేర తగ్గాయి.

 

ఆఫీస్‌ స్థలాన్ని లీజుకు తీసుకుంటున్న సంస్థ లో ఇన్ఫర్మేషన్‌ రంగానికి చెందిన సంస్థలే అధికంగా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే 2019లో ఐటీ/ఐటీఈఎస్‌లు లీజుకు తీసుకున్న స్థలం 42 శాతం పెరిగింది. వీటితోపాటు కో-వర్కింగ్‌ ఆఫరేటర్లు కూడా 14 శాతం అధికంగా అద్దెకు తీసుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులు కుదుటపడటం, మౌలిక సదుపాయాలరంగం ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చడంతో ఇప్పటి వరకు అధికంగా డిమాండ్‌ నెలకొన్నదని పేర్కొంది. ఆఫీస్‌ అబ్జర్వేషన్‌లో బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌లు 70 శాతానికి పైగా వాటాను కలిగివున్నాయి. కానీ, ఆర్థిక రాజధాని ముంబై మాత్రం 2 శాతం తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో 1.05 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్‌ను లీజుకు తీసుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: