రాష్ట్రంలో రాజధాని రగడ  రగులుతున్న విషయం తెలిసిందే. అమరావతిలో అయితే భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి రైతులు అందరూ ఒక్కసారిగా భగ్గుమన్నారు. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం తాము  పంట పండించుకొని భూమి నీ త్యాగం చేస్తే ఇప్పుడు రాజధాని అమరావతి నుంచి మారుస్తామని చెప్పి తమకు అన్యాయం చేయాలనుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతే కాకుండా రిలే నిరాహార దీక్షలు చేపడుతూ... భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. దీంతో అమరావతి లో వాతావరణం మొత్తం హాట్ హాట్ గా మారిపోయింది. 

 

 

 

 అయితే జగన్మోహన్ రెడ్డి  ప్రకటించిన 3 రాజధానిల అంశం అమరావతి ప్రాంతంలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు చిక్కులు తెచ్చి పెట్టింది . ఇప్పుడు వరకు ఆ ఎమ్మెల్యేలు ఇద్దరు ప్రజల్లోకి వెళ్లి మాట్లాడింది లేదు. ఓ వైపు పార్టీ అధినేత జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించ లేక ఇటు ప్రజలకు నచ్చ చెప్పలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు. గత వారం రోజులుగా తీవ్రస్థాయిలో నిరసనలు ధర్నాలు చేపడుతున్నారు అమరావతి రైతులు. అంతేకాదండోయ్ మంగళగిరి ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. 

 

 

 

 దీనిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వివరణ ఇస్తూ వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళితే ఇంత రాద్దాంతమా  అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లిన అమరావతి రైతులందరికీ నిరాశే ఎదురైంది. ఎమ్మెల్యే ఆర్కే అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి వినతి పత్రాన్ని అంటించారు అమరావతి రైతులు. ఇచ్చిన మాట ప్రకారం రాజధాని అమరావతి లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధాని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రంలో పేర్కొన్నారు అమరావతి రైతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: