విధిరాత అంటే ఇదేనేమో మొన్నటికి మొన్న ఓ అమ్మాయి జీవితాన్ని అత్యంత కౄరంగా బలి తీసికున్న చెన్నకేశవులు అనే యువకుడు పోలీసుల చేతిలో మరణించిన విషయం తెలిసిందే. ఇకపోతే వారి కుటుంబాన్ని మరో సారి విషాదంలోకి నెట్టిన సంఘటన మళ్లీ వారి కుటుంబంలో చోటు చేసుకుంది. ఇది విధి లీల అంటారేమో, లేక కర్మ ఫలం అంటారేమో.

 

 

చెట్టంత ఎదిగిన కొడుకు సమాజానికి చీడ పురుగులా మారి అనాధలా మరణించాడు. అతని మరణం కొందరికి శాంతినిస్తుంది కావచ్చూ, కానీ కన్న వారికి తీరని కడుపుకోతే. ఇక ఇప్పుడు చెన్నకేశవులు ఇంట్లో నెలకొన్న మరో విషాదం ఎంటంటే. చెన్నకేశవుల తండ్రి కురుమయ్య రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నారాయణ్ పేట్ జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో బైక్‌పై వెళ్తున్న కురుమయ్యను ఇన్నోవా వాహనం వేగంగా ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన ఆయన్ని స్థానికులు వెంటనే మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

 

కురుమయ్యకు అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం  ఆయన కుడికాలు విరిగిపోయిందని తెలిపారు. అదే సమయంలో కురుమయ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన్ని మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు.

 

 

ఇకపోతే కొడుకును కనడమే వీరు చేసిన పాపమా..? అతను చేసిన పాపం వీరి కుటుంబాన్ని వెంటాడుతుందా అని కొందరు అనుకుంటున్నారట. ఏది ఏమైనా కొడుకు మరణించాడనే దుఖంలో ఉన్న వారి ఇంట మరో సారి జరగరాని ఘోరం జరిగిందని కొందరు సానుభూతిని చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా దిశ హత్యకేసు నిందితుల్లో ఏ1 నిందితుడైన ఆరిఫ్ స్వగ్రామమే జక్లేర్ గ్రామంలోనే చెన్నకేశవుల తండ్రి కురుమయ్య కు ఇక్కడే ప్రమాదం జరగడంతో ఈ ప్రాంతం మరోసారి వార్తల్లోకి వచ్చింది...

మరింత సమాచారం తెలుసుకోండి: