జనసేన పార్టీ రాజకీయంగా నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. పవన్ గతంలో చేసిన తప్పిదాలన్నిటిని గుర్తించి పార్టీని ఒక దారిలో పెట్టే విధంగా ముందుకు వెళ్తున్నాడు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజా పోరాటాలను తలకెత్తుకుని మరీ కష్టపడుతున్నాడు. 2019  ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడం తమ ప్రధాన విధిగా ముందుకు వెళ్తున్నాడు. దానిలో భాగంగానే అధికార పార్టీ చేస్తున్న తప్పిదాలు, లోపాలను ఎత్తి చూపిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని సైతం వెనక్కి నెట్టి జనసేనను ప్రజా క్షేత్రంలో ముందుకు తీసుకువెళ్లే విషయంలో బాగా సక్సెస్ అవుతూ వస్తున్న సమయంలో తన స్పీడ్ కి సొంత అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి స్పీడ్ బ్రేకర్ లా తయారవ్వడం పవన్ కు మింగుడుపడడంలేదు. 

 


ఏపీలో లో మూడు రాజధానులు వస్తాయంటూ జగన్ చేసిన ప్రకటనపై జనసేన తరఫున తాను వ్యతిరేకించడం, అదే సమయంలో అమరావతి ప్రాంతం ప్రజలకు మద్దతుగా తమ పార్టీ తరపున నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న సమయంలో తన సొంత అన్న చిరంజీవి ఇదే విషయమై జగన్ ను ప్రశంసిస్తూ లేఖ రాయడం పవన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఇప్పుడే కాకుండా గతంలోనూ కుటుంబసమేతంగా చిరంజీవి విజయవాడకు వచ్చి మరి జగన్ ను కలవడం, జగన్ కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చిరు చెప్పడం అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఈ విషయమై జనసేన ను కార్నర్ చేస్తూ ఆ పార్టీ ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు కూడా చిరంజీవి అదేవిధంగా వ్యవహరిస్తుండడంతో మెగా అభిమానుల మధ్య చీలిక మొదలైంది. పవన్ సమర్థిస్తూ కొందరు, చిరుని సమర్థిస్తూ మరి కొందరు విమర్శలు చేసుకుంటూ ఉండడంతో ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.


 ఈ వ్యవహారాలతో మెగా అభిమానులు కాస్త రెండు గ్రూపులుగా విడిపోయారు. జనసేన రాజకీయంగా బలపడాలంటే ప్రభుత్వంపై పోరాడడమే సరైన విధానమని పవన్ కళ్యాణ్ భావిస్తూ వస్తున్న సమయంలో అదే పనిగా జగన్ ను చిరంజీవి పొగుడుతూ ఉండడం పవన్ ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఈ ఎఫెక్ట్ తమ సామాజిక వర్గం లో చీలిక తెస్తుందని పవన్ భయపడుతున్నాడు. అయితే ఇప్పటివరకు ఎక్కడా చిరు నిర్ణయాన్ని విమర్శించే సాహసం చేయలేదు. కానీ అదే సమయంలో ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే తన అన్నాను లెక్క చేయకూడదనే భావన పవన్ ఉన్నట్టు తెలుస్తోంది.

 

 జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు నాయకులపై ఉన్న కేసులను ఎత్తివేయడం, చిరంజీవి సన్నిహితంగా మెలుగుతూ వస్తుండడంతో ఆయన కూడా జగన్ పై సానుకూల దృక్పథంతో ఉన్నారు. ఇదే పవన్ కు నచ్చడం లేదు. తను జనసేన పార్టీ పెట్టి ఇంత కష్టపడుతున్న బహిరంగంగా తనకు మద్దతు ప్రకటించకపోగా ఇలా తమ రాజకీయ ప్రత్యర్థి కి బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే భావనలో పవన్ ఉన్నాడు. 

 


ముందు ముందు కూడా చిరంజీవి ఇదే రకంగా జగన్ ప్రభుత్వం పై అనుకూల వ్యాఖ్యలు చేస్తే రాజకీయంగా తాము తీవ్రంగా నష్టపోతామని పవన్ ఒక అంచనాకు వచ్చాడు. అందుకే ఇకపై చిరుని కూడా వదిలిపెట్టకుండా తన రాజకీయ ప్రత్యర్ధి గానే భావించాలని ఆలోచన పవన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జనసేన రాజకీయంగా అధికారం వైపు తీసుకు వెళ్లాలంటే ఖచ్చితంగా తన అన్న  విషయంలో మొహమాటాన్ని పక్కన పెట్టాలని పవన్ భావిస్తున్నాడు. అదే కనుక జరిగితే రాబోయే రోజుల్లో మెగా వార్ ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదిపే అవకాశం లేకపోలేదు.
.
  

మరింత సమాచారం తెలుసుకోండి: