ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని..రావాలని జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే ఒక్క అమరావతి ప్రాంతంలో మాత్రమే రాజధాని భూములు ఇచ్చిన రైతులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే సామాజిక వర్గానికి చెందిన ప్రజలు జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత చూపుతూ ఆ ప్రాంతంలో ఉన్న వైసిపి పార్టీ శ్రేణులపై మండిపడుతున్నారు.

 

ఇటువంటి తరుణంలో కృష్ణ మరియు గుంటూరు ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రాజధాని కట్టాలంటే కచ్చితంగా లక్ష కోట్లకు పైగానే అవసరం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా దగ్గర అంత డబ్బులు లేవు పైగా కేంద్రం ప్రభుత్వం కూడా రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితులు కనబడటం లేదు ఆ విధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఖజానా ని భ్రష్టు పట్టించారు అన్న రీతిలో వైసిపి పార్టీకి చెందిన రాజధానికి ప్రాంతానికి చెందిన నాయకులు మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు.

 

జిఎన్ రావు కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఇందులో ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని జిఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని మరియు అదే విధంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజధాని ప్రాంతానికి చెందిన రెండు జిల్లాలలో దాదాపు ప్రజలు మెజార్టీ ప్రజలు వైసిపి పార్టీని నమ్మటం జరిగిందని వారిని మోసం చేసే ఉద్దేశం జగన్ కి లేదని అవసరమైతే అమరావతి ఈ ప్రాంతంలో ఉన్న రైతులతో మాట్లాడి చర్చిస్తామని రాజధాని ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు క్లారిటీ ఇచ్చారు.

 

మరోపక్క 28వ తారీఖున వైజాగ్ ప్రాంతంలోకి సీఎం జగన్ అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో హైలెట్ భారీ ప్రాజెక్టులు పథకాలు వైజాగ్ ప్రాంతానికి జగన్ ప్రకటిస్తున్నారు అన్న వార్తలు వస్తున్న తరుణంలో వైజాగ్ ప్రాంతానికి చెందిన వైసీపీ పార్టీ శ్రేణులు భారీగా ఆహ్వానం ముఖ్యమంత్రి జగన్ కి పలకటానికి సెల్యూట్ కొట్టడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: