విజయసాయి రెడ్డి ఎప్పుడు మాట్లాడిన అది ఖచ్చితంగా ప్రతిపక్షానికి గుచ్చుకుంటుంది. ప్రతిపక్షాలు వణికిపోయేలా విజయసాయి రెడ్డి మాట్లాడుతారు. విజయసాయి రెడ్డి మాటలు చూస్తే ఆశ్చర్యం కూడా వేస్తుంది. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినా విజయసాయి రెడ్డి పార్టీపై ఒక్క మాట కూడా అనకుండా ప్రతిపక్షాలకు ట్విట్టర్ వేధికగా బుద్ది చెప్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. 

             

అటు టీడీపీ వాళ్ళు ఏ చిన్న తప్పు చేసిన సరే ఒక్క మాట అయినా అనకుండా ఉండరు. ఇంకా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్ పై అయితే ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న దేవినేని ఉమపై, యనమలపై, సుజనా చౌదరిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ తరహాలోనే మూడు రాజధానులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

            

విజయసాయి రెడ్డి విశాఖ ఎగ్జిక్యూటి రాజధాని విషయంపై మాట్లాడుతూ .. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి ఇక్కడకు రాబోతున్నారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నానిని మీడియా ప్రతినిధులు ప్రశినించారు. అయన స్పందిస్తూ రాజధానిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. త్వరలో ఏర్పాటు చేయబోయే హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అయన తెలిపారు.

      

అంతేకాదు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు, ప్రభుత్వానికి సంబంధం లేదని అయన తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అయన చెప్పారు. విశాఖ వైసీపీ ఇన్చార్జిగా ఆయన మాట్లాడి ఉండవచ్చని పేర్ని నాని అన్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: