తెలంగాణ రాష్ట్రంలో చాలా బలమైన పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకుని గత ఆరు సంవత్సరాల నుండి శాసిస్తున్నారు. రెండవసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఎవరి పొత్తు లేకుండా అదరగొట్టే మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కొద్దిగా దెబ్బతిన్న ఎక్కడ కూడా పార్టీకి డౌన్ఫాల్ అనేది రాకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తు చాలా సక్సెస్ఫుల్ నేత గా రాణిస్తున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు కేటీఆర్ అన్నట్టుగా టిఆర్ఎస్ పార్టీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్ చేయడం జరిగింది.

 

విషయంలోకి వెళితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తర్వాత ఆ స్థానంలో కూర్చున్నది ఎవరు కెసిఆర్ రాజకీయ వారసులు ఎవరు అన్న విషయంపై ఇప్పటి వరకు సరైన స్పష్టత ఎవరికీ లేదు. అంతేకాకుండా ఈ టాపిక్ పై మాట్లాడటానికి తెలంగాణ రాజకీయ నేతలు కూడా కొంత ఆలోచన చేస్తూ ఆచితూచి మాట్లాడతారు. అటువంటిది ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్  మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ అన్నట్టుగా భవిష్యత్ రాజకీయ నేతగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు.

 

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా రాణించిన శ్రీనివాస్ గౌడ్...టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి అయ్యారు. ఇటువంటి తరుణంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్కి ముఖ్యమంత్రి అవటానికి అన్నివిధాలా అర్హతలు ఉన్నాయని...ఉద్యమంలో కేటీఆర్ క్రియాశీలకంగా వ్యవహరించారని ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ రాబోయే రోజుల్లో కెసిఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేది కేటీఆర్ ఏ అన్నట్టు కామెంట్ చేయటం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వ్యాప్తంగా హైలెట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: