పై ఫొటోలో కనిపిస్తున్న అద్భుతమైన నిర్మాణాల్లో  ఎన్నింటిని చంద్రబాబునాయుడు కట్టారో ఎవరైనా చెప్పగలరా ?  పై ఫొటోల్లో కనిపిస్తున్న నిర్మాణాలన్నీ రాజధాని నిర్మిస్తే ఇలాగుంటుంది అని జనాలకు చెప్పటానికి చంద్రబాబు చేయించిన గ్రాఫిక్స్. ఇందులోనే అసెంబ్లీ, సచివాలయం, హై కోర్టు, రాజ్ భవన్ లాంటి అనేక నిర్మాణాలున్నాయి. వీటన్నింటినీ ప్రపంచంలోనే ప్రముఖమైన ఆర్కిటెక్టులతో గీయించారు. గ్రాఫిక్స్ లో తప్ప నిజంగా భూమిపై ఒక్కటీ కనబడదు.

 

సరే అధికారంలో ఉన్న ఐదేళ్ళూ  తాను కట్టబోయే రాజధాని  ఈ విధంగా ఉంటుందని జనాలను మాయచేస్తు చంద్రబాబు కాలం గడిపేశారు. ఎప్పుడైతే  అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత  జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేశారో అప్పటి నుండే చంద్రబాబు నిర్మించిన అద్భుతమైన రాజధాని తరలింపుపై ఒకటే గోల మొదలైంది.

 

తన ఐదేళ్ళ కాలంలో చంద్రబాబు చేసిందల్లా  తాత్కాలిక, నాసిరకం అసెంబ్లీ, సచివాలయం, హై కోర్టు భవనాలు మాత్రమే. చిన్నపాటి వర్షానికి కూడా పై భవనాల్లో జోరున కురిస్తున్న భవనాలను కూడా ఎల్లోమీడియా బ్రహ్మండమైన భవనాలని చెబుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. రైతుల ముసుగులో  కొందరు టిడిపి వాళ్ళు, పెయిడ్ ఆర్టిస్టులు రాజధానిని తరలించటం అన్యాయమని, అక్రమమని ఒకటే యాగీ చేస్తుండటమే విచిత్రంగా ఉంది.

 

ఆర్కిటెక్టులదేముంది చంద్రబాబు ఇచ్చిన కోట్ల రూపాయలు తీసేసుకుని ఏవో కొన్ని  డిజైన్లు గీసిచ్చేశారు.  ఇవన్నీ వాస్తవరూపంలోకి రావాలంటే లక్ష కోట్ల రూపాయలకు పైగా అవసరం. అంత పెట్టుబడి పెట్టటానికి చేతిలో డబ్బులేక, బ్యాంకులు ఇవ్వక, కేంద్రం సాయం అందిచకపోవటంతో చివరకు జనాలందరినీ అమరావతి పేరుతో భ్రమరావతి గ్రాఫిక్స్ చూపించి పబ్బం గడిపేసుకున్నారు.

 

ఆ విషయాన్ని గ్రహించే తాము నిండాముణిగామన్న విషయాన్ని రైతులు, జనాలు గ్రహించే చంద్రబాబును ఘోరంగా ఓడించారు.  తాను రాజధానిని బ్రహ్మాండంగా నిర్మించానని చెప్పుకుంటున్న చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో  మంగళగిరిలో పోటి చేసిన తన కొడుకు నారా లోకేష్ ఎందుకు ఓడిపోయాడో మాత్రం చెప్పలేకున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: