దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక‌య్యే బ్యాంకు మోసాల‌కు చెక్ పెట్టే కీల‌క గుడ్ న్యూస్ ఇది. ఆర్థిక లావాదేవీలు చేసే వినియోగ‌దారుల‌కు ఎదుర‌య్యే షాకుల నుంచి విముక్తి క‌లిగించే అంశ‌మిది. ముఖ్యంగా ప్ర‌జ‌ల సౌక‌ర్యం కోసం వ‌చ్చిన ఏటీఎం సేవ‌ల విష‌యంలో ఎదుర‌వుతున్న షాకుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా కీల‌క నిర్ణ‌యం వెలువ‌డింది. ఏటీఎం కార్డు జేబులో ఉండగానే ఆ ఖాతాదారుడికి తెలియకుండా డబ్బులు లాగేస్తున్న ప‌రిస్థితికి చెక్ పెట్టేలా బ్యాంకులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. ఇకపై దేశవ్యాప్తంగా అన్ని ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి క్యాష్‌ విత్‌ డ్రా చేసుకోవాలంటే వన్‌టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ)తోనే నగదు డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. వ‌చ్చే సంవ‌త్స‌రం తొలి రోజు నుంచే..ఈ ష‌ర‌తు త‌ప్ప‌నిస‌రి.

 

జేబులో అకౌంట్ ఉన్న వ్య‌క్తి ఏటీఎం కార్డు ఉండ‌గానే... డ‌బ్బులు విత్ డ్రా చేసుకున్న ఉదంతాల గురించి ఫిర్యాదులు ఇటీవల సైబర్‌క్రైమ్‌ పోలీసులకు విపరీతంగా వస్తున్నాయి. ఏటీఎం కార్డులు ఖాతాదారుల వద్ద ఉండగా..ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా అవుతున్నాయంటే గుర్తుతెలియని వ్యక్తులు ఆయా బ్యాంకు కార్డులను క్లోనింగ్‌ చేసి ఉంటారు. ఈ నేపథ్యంలోనే నగదు అక్రమ లావాదేవీలు, ఏటీఎం మోసాలను అరికట్టేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 1, 2020 నుంచి ఇకపై దేశవ్యాప్తంగా అన్ని ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి క్యాష్‌ విత్‌ డ్రా చేసుకోవాలంటే వన్‌టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ)తోనే నగదు డ్రా చేసుకోగలరు. అక్రమ, అనుమానాస్పద నగదు లావాదేవీలకు చెక్‌పెట్టేందుకు కొత్త సదుపాయం తీసుకొచ్చినట్లు ఎస్‌బీఐ పేర్కొంది.

 

పదివేలు, అంతకన్నా ఎక్కువ క్యాష్‌ ఉపసంహరణకు ఓటీపీ ఎంటర్‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఏటీఎం క్యాష్‌ విత్‌డ్రా సమయంలో ఖాతాతో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంట‌ర్ చేస్తేనే... సేవ‌లు కొన‌సాగుతాయి.  రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటలకు ఓటీపీ విధానం వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: