డిగ్రీ పూర్తి చేశారు.. సాఫ్ట్ వెర్ అవ్వాలనుకుంటున్నారు.. కానీ అవకాశాలు రావటం లేదు. అయితే ఈ పరీక్షా మీకోసమే.. టీసీఎస్‌ జాతీయ స్థాయిలో ఈ విద్యా సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు పూర్తిచేసుకుంటున్న విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించనుంది దీని ద్వారా ఎంపికైనవారికి కాగ్నిటివ్‌ బిజినెస్‌ ఆపరేషన్స్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌ విభాగాల్లో శిక్షణ అందించి శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు!

               

జాతీయ అర్హత పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. వీటికి 50 నిమిషాల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. వెర్బల్‌ ఎబిలిటీలో 10 ప్రశ్నలు, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌- 4, లాజికల్‌ రీజనింగ్‌- 12, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌- 12, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌- 12 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ఆంగ్ల వ్యాకరణంలో ప్రాథమిక పరిజ్ఞానం, వాక్యనిర్మాణం పరిశీలించే ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థి తర్కం, విశ్లేషణ నైపుణ్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. 

                

పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అందులోనూ విజయవంతమైతే మే 2020 నుంచి టీసీఎస్‌లో విధుల్లోకి తీసుకుంటారు. నమూనా పరీక్షను టీసీఎస్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దాని పరిశీలిస్తే ప్రశ్నల స్థాయి, ఏ అంశాలు చదవాలో తెలుస్తుంది.

                          

2019-20 విద్యా సంవత్సరంలో రెగ్యులర్‌ విధానంలో బీఏ, బీకాం, బీఎస్సీ ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. విద్యాభ్యాసం మొత్తంలో రెండేళ్ల కంటే ఎక్కువ గ్యాప్‌ ఉండకూడదు. పెండింగ్‌ బ్యాక్‌లాగ్స్‌ ఉండకూడదు. 10, ఇంటర్, డిగ్రీ కోర్సులు తొలి ప్రయత్నంలోనే పూర్తిచేసిన వారు అర్హులు.

మరింత సమాచారం తెలుసుకోండి: