రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది... టెక్నాలజీకి  అనుగుణంగానే అన్ని వస్తువులు తయారవుతున్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగితే...అంతలా  టెక్నాలజీకి అనుగుణంగానే మార్కెట్లోకి ప్రతీ వస్తువూ వస్తుంది. అది ఏ విషయంలో అయినా ఇలాగే జరుగుతోంది. రోజు మనం వాడే టూత్ పేస్ట్ నుంచి... మనం ప్రయాణించే  కార్ల వరకు ప్రతిదీ టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలా రోజురోజుకు టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు సాదాసీదా టీవీలో ఉండేవి.. ఇప్పుడు పెళ్లి ఎల్సిడి, ఎల్ఈడీ  లు  అంటూ సరికొత్త టెక్నాలజీతో టీవీలు మార్కెట్ లోకి వచ్చేసాయి. 

 

 

 ఒకప్పుడు మామూలు ఇంజన్లతో కార్లు ఉండేది కానీ ఇప్పుడు మాత్రం... సరికొత్త టెక్నాలజీతో ఆటోమేటిక్ సిస్టమ్ తో  సరి కొత్త కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇలా ప్రతి ఒక్కటి టెక్నాలజీకి అనుగుణంగా మారుతూనే ఉంది. ప్రజల ఆలోచన తీరు కూడా అందుకు అనుగుణంగానే ఉంటుంది. ఒకప్పుడు కేవలం కంప్యూటర్లు మాత్రమే ఉండేవి... ఎవరి దగ్గరైనా కంప్యూటర్ ఉంది అంటే అదో పెద్ద గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడు కంప్యూటర్ల కాలం పోయింది... ఎక్కడ చూసినా లాప్టాప్ లే  దర్శనమిస్తున్నాయి. లాప్టాప్ లో కూడా ఎన్నో రకాలు... దీంతో చాలామంది కంప్యూటర్లు కొనడం కంటే ల్యాప్టాప్ లు  కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 

 

 

 

 కంప్యూటర్ కొంటే ఇంట్లోనే ఉండి పని చేసుకోవాల్సి వస్తుంది అదే లాప్టాప్ అయితే మనం ఎక్కడికి వెళ్ళినా మన వెంటే తీసుకుపోవచ్చు. ఇప్పటికే టెక్నాలజీకి అనుగుణంగా ఎన్నో  లాప్టాప్లు మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా మరో లాప్టాప్ మార్కెట్లోకి వచ్చింది. ఇంతకీ ఈ కొత్తగా వచ్చిన లాప్టాప్ ప్రత్యేకత ఏమిటి అంటారా... ఈ లాప్టాప్ ప్రపంచంలోనే అతి చిన్నది. ప్రపంచంలోనే అతి చిన్న ల్యాప్టాప్ ను  చైనాకు చెందిన మ్యాజిక్ బెన్  కంపెనీ అత్యుత్తమ టెక్నాలజీతో తయారు చేసింది. దీనికి మ్యాగ్1 అనే పేరు పెట్టింది. ఇంతకీ దీని బరువు ఎంత అనుకుంటున్నారు 700 గ్రాములు మాత్రమే. ఈ అల్ట్రా పోర్టబుల్ లాప్టాప్ లో టచ్ ప్యాడ్ తో పాటు యుఎస్బి 3.0 పోర్ట్. టైప్ సీ  కనెక్టర్.. మైక్రోఎస్డీ కార్డ్.. ఆడియో సాకెట్లు  ఉన్నాయి. ఆపిల్ లాప్టాప్, మ్యాక్  బుక్ కన్న  తక్కువ ఉన్నప్పటికీ  దీని రేటు 790 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: