ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ ''ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగక పోతే టీడీపీ  నాయకులు, చంద్రబాబు నాయుడు వర్గం రియల్ ఎస్టేట్ వ్యాపారులు 4 వేల ఎకరాల భూమిని కూడబలుక్కున్నట్టు ఎలా కొంటారు? 2014 జూన్ లో బాబు సిఎం అయ్యారు. డిసెంబర్ లో అమరావతిని క్యాపిటల్ గా ప్రకటించే లోపే ఐదు నెలల్లో ఎగబడి కొన్నారంటే తెలియడం లేదా?'' అంటి విజయసాయి ట్విట్ చేశాడు.  

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు నిజమే లెండి అని కొందరు అంటే.. మరి కొందరు వ్యక్తిరేకంగా ట్విట్స్ చేశారు. మరికొందరు నెటిజన్లు మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి పెట్టిన ఈ ట్విట్ తో వైసీపీ అభిమానుల మధ్య టీడీపీ అభిమానుల మధ్య ట్విట్టర్ వేధికగా చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది. దీంతో ఈ ట్విట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేధికగా వైరల్ గా మారింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: