డిసెంబర్ 28న చరిత్రలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంతోమంది మరణాలు ఎంతోమంది జనాలను చోటుచేసుకున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

 

 లార్డ్ మెకాలే మరణం  : ఈయన మొదటి లా కమిషన్ చైర్మన్... ఇండియన్ పీనల్ కోడ్ సృష్టించింది లార్డ్ మోకాలెనే . అంతేకాకుండా భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది కూడా లార్డ్ మోకాలెనే  . కాగా  ఈయన 1800 అక్టోబర్ 20న జన్మించగా... 1859 డిసెంబర్ 28 న మరణించాడు. ఈయన సృష్టించిన పీనల్ కోడ్ ఇప్పటికీ భారతదేశంలో వాడుతున్నారు. భారతదేశంలో ఆంగ్ల విద్యకు బాటలు వేసిన మహానుభావుడు ఈయన. 

 

 

 భారత కాంగ్రెస్ స్థాపన : బ్రిటిష్ పాలనలో బానిసలుగా బ్రతుకుతున్న భారతీయుల్లో  చైతన్యం తీసుకురావడానికి ఆనాడు  భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ద్వారా అందరిలో చైతన్యం తీసుకు వస్తూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం చేసేలా అందరినీ చైతన్య పరిచారు. 1885 డిసెంబర్ 28న జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది. ఏవో హ్యూమ్  అనే అధికారి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అయితే కాంగ్రెస్ స్థాపించినప్పుడు ఆంగ్లేయులపై భారతీయులకు నమ్మకం ఉన్నప్పటికీ.. కాలక్రమంలో కాంగ్రెస్ పార్టీని స్వతంత్ర సముపార్జనకు  ఉపయోగించుకుని విజయం సాధించారు. ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు.

 

 

 

 ధీరుబాయ్ అంబానీ జననం : ప్రపంచ ధనికులు  వ్యాపార దిగ్గజాలు లో ఒకరు ధీరుబాయ్ అంబానీ. ధీరజ్లాల్ హిరాచంద్  అంబానీ.. ధీరుబాయ్ అంబానీ గా పేరుగాంచారు. ఈయన డిసెంబర్ 28, 1932 నేటి గుజరాత్ లో జన్మించారు. పేదరికం నుంచి ధనికుడిగా  ఎదిగి అందరికీ స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ధీరుబాయ్ అంబానీ. ప్రపంచ ధనికుల అందురిలో  ఒకరు. రిలయన్స్ పరిశ్రమలు స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు ఈయన. జూలై 6 2002 సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ధీరుబాయ్ అంబానీ వారసులుగా ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ లు  కొనసాగుతున్నారు. వీరిలో ముఖేష్ అంబానీ తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని అంచలంచలుగా ఎదుగుతూ ప్రపంచ ధనికులలో  ఒకరుగా కొనసాగుతున్నారు.

 

 

 నేరెళ్ల వేణుమాధవ్ జననం : ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్ 1932 డిసెంబర్ 28న వరంగల్ లో  జన్మించారు. ఎంతోమంది స్వరాన్ని మిమిక్రీ చేసి ఎంతో పేరు సంపాదించుకున్నారు నేరెళ్ళ వేణుమాధవ్. ఈయన గౌరవప్రదమైన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆనాటి కాలంలో నటుల అందరి వాయిస్ ను  మిమిక్రీ చేస్తూ తెలుగు ప్రేక్షకులు అందరిని అలరించారు నేరెళ్ళ వేణుమాధవ్.

 

 

 అరుణ్ జైట్లీ జననం : ప్రముఖ రాజకీయవేత్త అరుణ్ జైట్లీ 1952 డిసెంబర్ 28న న్యూఢిల్లీలో జన్మించారు. అరుణ్ జైట్లీ  తన రాజకీయ జీవితాన్ని బిజెపి పార్టీ నుంచి స్థాపించి చివరి వరకు బిజెపి పార్టీలో కొనసాగారు. బీజేపీ పార్టీలో ఎన్నో పదోన్నతులు కూడా చేపట్టారు అరుణ్ జైట్లీ. వాజ్ పేయ్  మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా.. మోడీ మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ పదోన్నతులు చేపట్టారు. విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన అరుణ్ జైట్లీ అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు. దేశ దిగ్గజ న్యాయవాదులలోనే ఒకడిగా పేరొందారు అరుణ్ జైట్లీ . ఓవైపు న్యాయవాదిగా మరోవైపు రాజకీయ నాయకుడిగా కొనసాగిన ఆయన ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల వైపు నడిచారు. ఆగస్టు 24, 2019 సంవత్సరంలో అరుణ్ జైట్లీ తుది శ్వాస విడిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: