ప్రముఖ పాత్రికేయునిగా ప్రచారంలో ఉన్న శేఖర్ గుప్తా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడటమే విచిత్రంగా ఉంది.  సిఎం ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్ ను విమర్శిస్తు జగన్ ను ఈ పాత్రికేయుడు పిచ్చితుగ్లక్ అంటూ సంబోధించటమే ఆశ్చర్యంగా ఉంది. శేఖర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కేవలం చంద్రబాబునాయుడును సంతృప్తి పరచటానికి మాత్రమే నోటికొచ్చినట్లు మాట్లాడినట్లు అర్ధమైపోతోంది.

 

జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయాన్ని పక్కనపెట్టేస్తే అంతకుముందు ఐదేళ్ళు అమరావతి ప్రాంతంలో చంద్రబాబు చేసిన విధ్వంసం శేఖర్ కు కనబడలేదా ? ఏడాదికి మూడు పంటలు పండే పచ్చిన వేలాది ఎకరాలను చంద్రబాబు నాసినం చేసిన విషయం పాత్రికేయునికి తెలీదా ?  ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో  వేలాది ఎకరాలను చంద్రబాబు అండ్ కో సొంతం చేసుకున్న విషయం తెలీకుండానే మాట్లాడుతున్నారా ?

 

అర్బన్ ప్లానింగ్ లో ఎంతో అనుభవమున్న శివరమాకృష్ణన్ కమిటి అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణమే వద్దని మొత్తుకున్నా చంద్రబాబు ఇక్కడే ఎందుకు రాజధానిని ఏర్పాటు చేద్దామని అనుకున్నారో ఎప్పుడైనా శేఖర్ ఆలోచించారా ?  శివరామకృష్ణన్ కమిటిని కాదని నారాయణతో  చంద్రబాబు అసలు కమిటిని ఎందుకు వేశారు ? శివరామకృష్ణన్ కన్నా నారాయణ ఎందులో గొప్పో శేఖర్ చెప్పగలరా ?

 

రూ. 70 వేల కోట్ల అప్పులతో రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో  మొదలైన రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చుతో  ప్రపంచంలోనే అత్యద్భుత కలల రాజధాని అవసరమా అని ఈ పాత్రికేయుడు ఒక్కసారి కూడా ఆలోచించినట్లు లేదు.  చంద్రబాబు చెబుతున్నట్లుగా అమరావతిలో రూ. 2 లక్షల కోట్ల సంపద సృష్టిస్తే మరి 43 వేల కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు పెండింగ్ పెట్టినట్లు ? తన పాలనలో 1.7 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేసినట్లు ? ఎక్కడో ఢిల్లీలో కూర్చుని చంద్రబాబు చెప్పినట్లుగా డూడూ బసవన్నలాగ తలూపి జగన్ పై విషం చిమ్మటం మానుకోకపోతే శేఖరే నవ్వుల పాలవుతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: