జాతి వివక్ష ఎక్కడ చూడు కనిపిస్తుందని, హింసిస్తుందని మరో సారి రుజువు అయ్యింది. నిజానికి భరతమాత పురిటిగడ్డ మీద బ్రతికే ప్రతి బిడ్డకు ఏ వివక్ష ఉండదు. కాని విదేశాల్లో బ్రతికే కొందరికి విషం లా ఒళ్లంతా ఈ జాతి వివక్ష నిండిపోయి ఉంటుందని మరో మారు పాకిస్తాన్ నిరూపించిది. అదేమంటే పాకిస్థాన్ తరఫున టెస్టుల్లో నిలకడగా రాణించిన డానిష్ కనేరియాని..  హిందువు అనే కారణంతో సహచరులు అవమానించినట్లు తెరపైకి ఈ వివాదం వచ్చింది.

 

 

ఇదే కాకుండా పాక్ తరుపున 61 టెస్టులు ఆడి 261 వికెట్లు తీయడంతో పాటు 18 వన్డేలకు కూడా ప్రాతినిథ్యం వహించిన కనేరియా హిందువు కాబట్టి కొందరు క్రికెటర్లు అతడితో కలిసి భోజనం కూడా చేసే వాళ్లు కాదని తెలిసింది.. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు స్పందిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ లాంటి జట్లకు చుక్కలు చూపించడమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్ లో ఒక వెలుగు వెలిగి ఈ పాకిస్తాన్ ఆటగాడు నేడు కష్టాలు పడుతున్నాడు. తనను ఆదుకోవాలని క్రికెట్ ప్రపంచాన్ని కోరుతున్నాడు. ప్రస్తుతం తన జీవితం అంత సాఫీగా సాగడం లేదని బాధతో వెల్లడించాడు.

 

 

అయితే తన సమస్యల పరిష్కారం కోసం పాక్‌ తో పాటుగా ఇతర దేశాల్లోని చాలామందిని కలిశానని. చాలామంది పాక్‌ క్రికెటర్ల సమస్యలు పరిష్కారమైనా ఇప్పటికీ నాకే సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేసాడు. ఒక క్రికెటర్‌గా పాకిస్థాన్‌కు చేతనైనంత చేశానని అందుకు గర్విస్తున్నానన్నాడు. అత్యవసరమైన ఈ సందర్భంలో పాక్‌ ప్రజలు నాకు సాయపడతారని సానుకూలంగా ఉన్నానని ఆశాభావం వ్యక్తం చేసాడు. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సహా దిగ్గజ ఆటగాళ్లు, క్రికెట్‌ పాలకులు, ఇతర దేశాల సహకార౦ తనకు అవసరమన్నాడు.

 

 

దయచేసి ముందుకొచ్చి తనకు సాయం చేయాలని కోరాడు.. అసలే హిందువులంటే పడని పాకిస్తాన్ పాపం ఈ క్రికెటర్‌ను ఆదుకుంటుదనే నమ్మకం లేదని కొందరు వాపోతున్నారు.. ఇటువంటి పరిస్దితుల్లో మన భారత క్రికెటర్స్ అందరు తలో చెయ్యివేసి మన భారతదేశ కీర్తిని మరోసారి చాటితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: