సహజీవనం నగరాల్లో నివసిస్తున్న వారికీ ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామాల్లో నివసించే వారందరికీ అని చెప్పను కానీ మన పూర్వీకులకు ఈ సహాజీవనం గురించి చెప్పాము అంటే కొట్టడానికి వస్తారు. అలాంటి స్వదేశీ సంప్రదాయం ఈ సహజీవనం సంప్రదాయం.            

 

అయితే ఈ సహాజీవనం మన భారత్ లో చాలా డేంజర్.. ఎందుకంటే సహజీవనం గురించి ఏమి తెలియకుండానే సహజీవనం చేసేస్తారు. చిక్కుల్లో పడుతారు. ఇంకా అసలు విషయంలోకి వస్తే.. ఢిల్లీకి చెందిన ఓ ఎయిర్‌హోస్టెస్ ను హైదరాబాద్ నగర వాసి ఘోరంగా మోసం చేశాడు.         

 

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నాలుగేళ్లు ఆమెతో సహజీవనం చేసి మోసం చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఢిల్లీకి చెందిన ఎయిర్‌హోస్టెస్‌‌.. హైదరాబాద్‌కు చెందిన సాలెం అలీ ఇద్దరు ప్రేమించుకొని సహజీవనం దాదాపు నాలుగేళ్ళ పాటు ఆమెతో సహజీవనం చేశాడు.              

 

అలా సహజీవనం చేసి దాదాపు ఆమె వద్ద నుంచి రూ.15 లక్షలు కాజేశాడు. అంతేకాదు ఆమెను అన్యాయంగా కొట్టి ఇంట్లో నుండి వెళ్లగొట్టేశాడు. దీంతో బాధితురాలు సమీపంలోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాలెం అలీ ఓ పబ్ లో ఉండగా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు పంపారు. 

 

కాగా ఇలాంటి ఘటనలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గటం లేదు. అమ్మాయిలు అబ్బాయిలు విదేశీ ట్రెండ్ ఫాలో అవుతూ ఇలా మోసపోతున్నారు. అందుకే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి.. అబ్బాయిలను అసలు నమ్మకూడదు.. ఈ మహా నగరంలో ఎవరు ఎలా ఉంటారో దేవుడికి కూడా తెలియదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: