న్యూ ఇయర్ వేడుకల కోసం దేశంలో ప్రముఖ నగరాలు అన్ని సిద్ధమవుతున్నాయి. చాలా పబ్బుల్లో ఆకర్షించే విధంగా ఆఫర్లు ఇస్తూ రాబోయే ఏడాది కోసం పలు పార్టీలు రెడీ చేస్తున్నారు. జనాలను ఆకర్షించటానికి బార్లు మరియు పబ్లు వాటి యొక్క యజమానులు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇటువంటి తరుణంలో వైజాగ్ నుంచి కోట్ల విలువైన గంజాయి హైదరాబాద్ కి న్యూ ఇయర్ కోసం తరలిస్తున్నట్లు పోలీసుల నిఘాలో బయటపడింది. మేటర్ ఏమిటంటే యూత్ ని టార్గెట్ గా చేసుకుని భారీగా గంజాయి ముఠా సరఫరా చేయటానికి రెడీ అవుతున్నట్లు నిఘాలో తేలింది. దాదాపు కొన్ని కోట్ల బిజినెస్ కు రాబోయే న్యూ ఇయర్ వేడుకలు శ్రీకారం చుట్టినట్లు దీంతో గంజాయి స్మగ్లర్లు మరియు గంజాయి ముఠాలు ఈ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి భారీగా వైజాగ్ నుండి హైదరాబాద్ నగరానికి గంజాయి సరఫరా చేయడానికి రెడీ అయినట్లు పోలీసులు నిఘాలో చేరటంతో అన్ని చోట్ల వైజాగ్ చుట్టుప్రక్కల ప్రాంతాల చోట్ల చెక్ పోస్టుల దగ్గర నిఘా ఏర్పాటు చేశారు. వెళ్లే ప్రతి వెహికల్ ని తనిఖీ చేసి మరీ పంపిస్తున్నారు.

 

అంతేకాకుండా గోవా నుంచి హైదరాబాద్ కి భారీగా డ్రగ్స్ కూడా సరఫరా కాబోతున్నట్లు విషయం బయట పడింది. మొత్తం మీద రాబోయే నూతన సంవత్సర వేడుకలకు జనాలను మత్తు లతో ముంచి గంజాయి మరియు డ్రగ్స్ ముఠా కొన్ని కోట్ల లో బిజినెస్ చేయడానికి రెడీ అయినట్లు వైజాగ్ నీ సెంటర్ గా చేసుకుని భారీగా గంజాయి తరలించడానికి రెడీ అయినట్లు తాజాగా బయటపడటంతో రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యారు.

 

మరోపక్క యువత కూడా గంజాయి మరియు డ్రగ్స్ రాబోయే ఏడాదిలో వేడుకల కోసం వాడటానికి ముస్తాబవుతున్నాట్లు ఎక్కువగా మందు కంటే గంజాయి మరియు డ్రగ్స్ కె బాగా అలవాటు పడుతున్న నేపథ్యంలో రాబోయే న్యూ ఇయర్ యువతని బాగా గంజాయి మత్తులో ముంచడానికి గంజాయి ముఠాలు రెడీ అవుతున్న తరుణంలో మరో పక్క పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: