ప్రస్తుతం యువతను పిచ్చెక్కిస్తున్న గేమ్  పబ్జి. ఎంతోమంది ఈ మాయదారి గేమ్ కు  బానిసలుగా మారిపోయారు. మొబైల్ లో గేమ్ ఆడుతున్నట్లు గానే  జీవితంలో కూడా ప్రవర్తిస్తున్నారు చాలామంది. అంతలా నేటి తరం యువతను ప్రభావితం చేసింది ఈ మాయదారి పబ్జి గేమ్. ఈ పబ్జి  వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వారు సైతం ఉన్నారు. అంతే కాకుండా ఎంతో మంది మతిస్థిమితం కూడా కోల్పోయారు. ఇకపోతే తాజాగా ఓ యువకుడు పబ్జి గేమ్ లో అమ్మాయిల తో పరిచయం పెంచుకున్నాడు. వారిని  లోబర్చుకోవాలని ప్రయత్నాలు చేశాడు. కానీ చివరికి వ్యూహం వికటించి కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నాంపల్లి కి చెందిన సల్మాన్ అనే యువకుడు పబ్జి ఆడే వాడు... ఈ క్రమంలోనే  అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. 

 

 

 

 ఆ  అమ్మాయితో మాయమాటలు చెప్పి వాట్సాప్ నెంబర్ స్వీకరించాడు. వాట్సాప్ నెంబర్ ద్వారా ఆ అమ్మాయితో చాట్ చేసి  వివరాలు తెలుసుకున్నాడు. ఆమె వ్యక్తిగత వీడియోలు ఫొటోలను కూడా స్వీకరించాడు ఆ యువకుడు. దీంతో ఎలాగైనా ఆ అమ్మాయిని  లోబరుచుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ని ప్రేమిస్తున్నాను అని మాయ మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. అనంతరం తనతో గడపాలని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం ఆరంభించాడు. దీంతో ఆ యువకుడికి తీరుతో భయపడిన  ఆ యువతి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. 

 

 

 

 దీంతో ఆ యువతి తల్లిదండ్రులు సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వ్యూహం ప్రకారం సల్మాన్ ను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. నిందితుని రిమాండ్ కు తరలించి విచారిస్తున్నారు. సల్మాన్ మొబైల్ డేటా ఆధారంగా ఇంకెంత మంది అమ్మాయిలను మోసం చేసి బ్లాక్ మెయిల్ చేశాడు అనే కూపీ  పనిలో పడ్డారు పోలీసులు. ఇకపోతే పబ్జి ద్వారా ఎన్నో అనర్థాలు జరిగిన విషయం తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు... ఎన్నో జీవితాలు నాశనం అయిపోయాయి . ఒక్కసారి పబ్జి ఆడడం మొదలు పెట్టారంటే అది ఒక వ్యసనంలా మారిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: