ప్రస్తుతం మన జీవితంలో ఆధార్ కార్డు కీలకపాత్ర వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒక మనిషి ఏం చేయాలన్నా దానికి ఆధార్ కార్డ్ అత్యవసరం అయిపోయింది. ఇలాంటి ఖాతా  ఓపెన్ చేయాలన్నా... ఏదైనా లోన్ తీసుకోవాలి అన్న... ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలన్న.. చివరికి సిమ్ కార్డు  కొనుగోలు చేయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు లేదంటే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఏ డాక్యుమెంట్  లేకపోయినా పర్వాలేదు కానీ ఆధార్ కార్డు కచ్చితం అన్నట్లుగా మారింది పరిస్థితి. ఇక బ్యాంకు ఖాతాలకు అయితే తప్పనిసరిగా ఆధార్ కార్డులు జత చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులతో పాటు పాన్ కార్డు కూడా బ్యాంక్ అకౌంట్ లోకి జాతీయ. 

 

 

 

 ఇకపోతే ఆధార్ కార్డుతో  పాన్ కార్డు జత చేయడం తప్పనిసరి. ఇలా ఆధార్ కార్డుతో  పాన్ కార్డు జత చేయడం వల్ల మోసాలకు తావులేకుండా తగిన రుసుము చెల్లించేందుకు వీలుగా ఉంటుందని కేంద్రం సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో ఆధార్ కార్డుతో  పాన్  అనుసంధానం చేయాలని తెలిపింది కేంద్రం. అయితే ఇప్పటి వరకు కేంద్రం ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ... ఇప్పటికీ కూడా ఆధార్ కార్డుతో  పాన్ కార్డు  అనుసంధానం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు.దీంతో  బ్యాంకు ఖాతాలో ఎన్నో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 

 

 

 ఇకపోతే పాన్ కార్డు ను  ఆధార్ కార్డు తో జత చేసుకునేందుకు కేంద్రం ఇప్పటికీ దేశ ప్రజలందరికీ ఎన్నోసార్లు గడువును పొడిగిస్తూ వచ్చింది. అయిన కూడా చాలా మంది ఆధార్ కార్డుతో  పాన్ కార్డు  లింక్ చేసుకోని వాళ్ళు ఉన్నారు. అయితే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి చాలాసార్లు కేంద్రం గడువును పొడిగించగా...   తాజాగా డిసెంబర్ 31తో ఈ గడువు ముగియ నుంది . మరోసారి గడువు పెంచే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఇక ఎంవిపి చిప్ తో  కూడిన డెబిట్ కార్డును డిసెంబర్ 31 లోపు తీసుకోవాలని సూచించింది ఎస్బిఐ. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఏటీఎం కార్డులు డిసెంబర్ 31 తర్వాత పనిచేయవు అని తెలిపింది. అంతేకాకుండా ఐటీ రిటర్న్స్ డిసెంబర్ 31 వరకు చెల్లిస్తే కేవలం ఐదు వేలు  మాత్రమే రుసుము పడుతుందని లేదంటే ఆ తర్వాత 10000 కట్టాల్సి వస్తుంది అని హెచ్చరించింది ఎస్బిఐ.

మరింత సమాచారం తెలుసుకోండి: