ఈ కాలంలో చదువులు ఉంటున్నాయి.. కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాలు ఉండటం లేదు.. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే ఫీల్ అయ్యేవారు ఇప్పుడు ఏ ఉద్యోగం చేసిన ఫీల్ ఏ అవుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికి రావు ఎవరో కొందరికి మాత్రమే న్యాయంగా వస్తాయి.. మిగితా అందరికి రెకమండేషన్ తో, డబ్బుతోను ఉద్యోగాలు వస్తాయి. 

            

అది వేరే విషయం. కానీ గవర్నమెంట్ ఉద్యోగం కాకుండా ప్రైవేట్ ఉద్యోగం వచ్చింది అంటే.. వారి జీవితం ఎంత దారుణం అంటే.. చెప్పకూడదు.. గవర్నమెంట్ ఉద్యోగల చోటా డబ్బు, రెకమండేషన్ తో అయితే ప్రైవేట్ రంగంలో రాజకీయాలు ఎక్కువ. మనకు ఎంత టాలెంట్ ఉన్న సరే తొక్కేస్తారు.              

                          

మనం తొక్కలేం కాబట్టి.. ఈ కాలంలో ఉద్యోగం కంటే వ్యవసాయం ఏ మంచిది అంటున్న. ఇంకా అసలు విషయానికి వస్తే.. కొంచం టెక్నాలజీ, కొంచం తెలివి, కొంచం కష్టం పడితే వ్యవసాయంలో ఉండే సంతోషం, ఆనందం, వచ్చే ఆనందమే వేరు. మీకు అనిపించచ్చు.. అంతలేదు అని.. ఈ కాలంలో రైతులు ఆత్మహత్యలు అని. 

 

కొంచం ఖర్చు అయినా కూడా మంచి నీరు ఉన్న పొలం తీసుకొని అందులో కాలానికి సంబంధించి పంటలు వేసుకుంటే మీ పొలానికి మీరే రాజులు. మిమ్మల్ని శాసించేవారు ఉండరు.. మీపై రాజకీయాలు చేసే వారు ఉండరు. ఇలా తన పొలంలో తానే వ్యవసాయం చేసుకుంటూ సంవత్సరానికి సాఫ్ట్ వెర్ ఉద్యోగి కంటే ఎక్కువ జీతాన్ని సంపాదిస్తునందు.. ఎమ్మేసి, బీఈడి చదివిన యువకుడు నర్సిరెడ్డి. మరి మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు వ్యవసాయం?

మరింత సమాచారం తెలుసుకోండి: