ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై వస్తున్న ఆరోపణలు అన్ని ఇన్ని కావు. పేద ప్రజలకోసం ఎన్నో రకాలైన పధకాలను అమలు చేస్తూనే రాష్ట్ర అభివృద్దికోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు జగన్. ఇటువంటి సమయంలో పనీ పాట లేక పొద్దుపోక ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం జగన్ పై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ. మీడియాతో, ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు..

 

 

ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందన్న ఆరోపణలను ఖండిస్తూ, ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ఒకవేళ తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే మొదట తానే ప్రశ్నిస్తానని పేర్కొన్నారు. ఇదే కాకుండా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్రిస్టియన్ అంటూ జరుగుతున్న ప్రచారం అబద్దమని, ఆ ఆరోపణలు అన్ని అవాస్తవాలేనని తెలిపారు. అంతేగాక, హిందూ విశ్వాసాలను గౌరవించేలానే జగన్ సర్కారు చర్యలు ఉన్నాయి, గత ప్రభుత్వంతో పోలిస్తే మున్ముందు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని ఈ లోపలే తొందరపడి అనవసరమైన ప్రచారాలకు అవకాశం ఇవ్వద్దంటూ తెలిపారు.  

 

 

జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొందరు పనికట్టుకుని అనవసరమైన వాదనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ చెప్పారు. టీటీడీపై మతపరమైన ఆరోపణలు చేస్తున్నవారిపై కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా టీటీడీ సిబ్బంది, చైర్మన్‌కు ఎంపీ సూచించారు. ఇకపోతే రాహుల్ గాంధీ కుటుంబంపై కూడా సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాహుల్ కుటుంబం ఫాసిస్ట్ ఫ్యామిలీ అని, సోనియా తండ్రి హిట్లర్ అని.. ఆర్మీలో సైనికుడిగా ఉండి రష్యాపై దాడి చేశారని అన్నారు. అంతేగాక, ప్రియాంక గాంధీ వాద్రా పోలీసులపై దాడి చేశారని, ఆమెపై కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: