మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు మాడు పగిలిపోయిందగ్గర నుండి ఏబిఎన్-రాధాకృష్ణ ఎండి వేమూరి రాధాకృష్ణ బాధ అంతా ఇంతా అని చెప్పటానికి లేదు.  ఎంతగా కాపుకాసినా, ఎన్ని జాకీలు వేసినా చంద్రబాబు ఓటమిని అడ్డుకోలేకపోయామనే బాధ ఒకవైపు. అదే సమయంలో  బద్ధశతృవు  జగన్మోహన్ రెడ్డి అఖండ మెజారిటితో అధికారంలోకి రావటం మరో సమస్యగా మారిపోయింది.

 

బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి జగన్ ఏమి చేసినా తప్పే ఏమీ చేయకపోయినా తప్పే రాధాకృష్ణకు.  ప్రతిరోజు జగన్ పై అనేక అంశాలపై అనేక రూపాల్లో చంద్రబాబు ఏడుస్తుంటే వారానికొకసారి తన కరపత్రికలో  కొ(చె)త్తపలుకు పేరుతో రాసుకునే ఏడుపు దీనికి బోనస్ లాంటిదనే చెప్పాలి. ప్రతీవారం వచ్చే ఈ చెత్తపలుకులో  జగన్ పై ఎంత విషయం చిమ్ముతున్నారో అందరూ చూస్తున్నదే.

 

అలాంటి విషాన్నే రాధాకృష్ణ తాజాగా మరోసారి చిమ్మారు.  జగన్ ’ధర్మం తప్పిన రాజు’ అట. అమరావతి తరలింపు విషయంలో జగన్ కడపులో ఏదో పెట్టుకుని బయటకు మరేదో చెప్పటం వల్లే సమస్య మరింత జటిలమవుతోందని ఈయన తేల్చేశారు. నిజానికి వేమూరి చెప్పింది చంద్రబాబుతో పాటు తనకే సరిగ్గా సరిపోతుంది. పైకి రాష్ట్రం మొత్తానికి అమరావతి మధ్యలో ఉంది కాబట్టే రాజధానిగా ఎంపిక చేశామని పైకి చెబుతున్న కారణం అబద్ధమని వాళ్ళకీ తెలుసు.

 

తన సామాజికవర్గం కోరిక, ఒత్తిడి మేరకే అమరావతిని చంద్రబాబు రాజధానిగా ఎంపిక చేశారన్నది వాస్తవం. అలాగే ఐదేళ్ళల్లో ఒక్క శాస్వత భవనం కూడా నిర్మించలేకపోవటం చంద్రబాబు చేతకాని తనం. ఒక్క రాజధానికే దిక్కులేకపోతే జగన్ మూడు రాజధానులు ఎలా కడతారని రాధాకృష్ణ లాంటి మహా మేధావి కూడా ప్రశ్నించేస్తున్నారు. అసలు తాను రాజధానినే కట్టనని జగన్ చెబుతున్నది వీళ్ళకు అర్ధం కావటం లేదు. విశాఖపట్నానికి రాజధానిని తరలిస్తే ప్రత్యేకంగా నిర్మించాల్సిన అవసరం ఏముంది ?

 

అభివృద్ధి చెందిన నగరాన్నే రాజధానిగా ఏర్పాటు చేసుకుంటే ప్రత్యేకంగా రాజధాని కట్టాల్సిన అవసరం ఏముంటుంది ?  దాని మీద పెట్టాల్సిన ఖర్చును రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్దికి పెట్టవచ్చని జగన్ చెబుతున్నది వీళ్ళకు అర్ధంకావటం లేదు. నిజానికి జగన్ చెబుతున్నది కరెక్టే అని చంద్రబాబు, రాధాకృష్ణలకు కూడా తెలుసు. అయినా తమ సామాజికవర్గం ఆర్ధిక మూలాలపై  దారుణంగా దెబ్బ పడుతోందన్న ఏడుపే వీళ్ళని నిద్రపోనీయటం లేదు. అందుకే పదే పదే జగన్ పై విషం చిమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: