జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన విశాఖపట్నం రాజధానిపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత రెచ్చగొట్టటానికి ఎల్లోమీడియా నానా అవస్తలు పడుతోంది. సోమవారం తన పత్రికలో ’అమ్మో .. అంత దూరమా’ అనే హెడ్డింగ్ తో ఓ చెత్త వంటకాన్ని వండి పడేసింది. ఆ కథనంలో ఎల్లోమీడియా ఏడుపు ఏమిటంటే  ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం నుండి రాయలసీమలోని కర్నూలు, కడప, రాయలసీమ, చిత్తూరు నుండి ఎంతెంత దూరమో తలచుకుని గుండెలు గుభేలు మంటున్నాయట. అందుకనే విశాఖపట్నం రాజధానిగా వద్దంటే వద్దని వ్యతిరేకిస్తున్నారట. వ్యతిరేకిస్తున్న వాళ్ళల్లో ఒక్కళ్ళ పేరు కూడా లేదు.

 

ఇక్కడే ఎల్లోమీడియా కథనంలోని డొల్లతనం, జగన్ పై తనకున్న వ్యతిరేకత స్పష్టంగా బయటపడిపోతోంది. ఎందుకంటే చంద్రబాబునాయుడు ఎంపిక చేసిన అమరావతి నుండి కూడా రాయలసీమలోని పై నాలుగు నగరాలకు దాదాపు ఇంతే దూరమో లేకపోతే ఇంకా ఎక్కువ దూరమో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని మరచిపోయి జగన్ పై విషం చిమ్మటమే టార్గెట్ గా పనిచేస్తోంది. విచిత్రమేమిటంటే పై నాలుగు నగరాల నుండి అమరావతి మధ్య రోడ్డు దూరంలో తప్పు వివరాలను ఇవ్వటంలోనే ఎంత వ్యతిరేకతతో పనిచేస్తున్నారో అర్ధమైపోతోంది.

 

విశాఖపట్నం నుండి రాయలసీమలోని పై నాలుగు నగరాలకు ఎంతెంత దూరమో మ్యాపుతో సహా కథనాన్ని వండి వార్చింది. అదే సమయంలో మ్యాపులతో కొట్టిచూస్తే పై నాలుగు నగరాల నుండి అమరావతి ఎంత దూరమో తెలుస్తుందన్న విషయాన్ని మరచిపోయినట్లుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అమరావతి నుండి చిత్తూరుకు రైలు మార్గమైతే 1224 కిలోమీటర్లు, రోడ్డు దూరమైతే 1092 కిలోమీటర్లు. దాదాపు 13 గంటలు ప్రయాణం చేయాలి.

 

అలాగే అమరావతి నుండి అనంతపురంకు రైలులో అయితే 1004 కిలోమీటర్లు, రోడ్డు ద్వారా అయితే 902 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 15 గంటలు ప్రయాణం చేస్తేకానీ అమరావతి చేరుకునేందుకు లేదు. ఇక అమరావతి నుండి కర్నూలుకు రైలు ద్వారా అయితే 840 కిలోమీటర్లు, రోడ్డు ద్వారా అయితే  760 కిలోమీటర్ల దూరాన్ని 15 గంటలు ప్రయాణం చేస్తే కానీ చేరుకోలేరు.

 

అలాగే అమరావతి నుండి కడప మధ్య రోడ్డు మార్గంలో 923 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే కానీ చేరుకోరు. రైలు కనెక్టివిటి అసలు లేనే లేదు. అలాగే అమరావతి నుండి శ్రీకాకుళం చేరుకోవాలంటే  సుమారు 900 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇక రైలు మార్గమే లేదు. రాజధానిని ఎక్కడ పెట్టినా ఎవరికీ తమ ఊరికి దగ్గర్లోనే ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఒకపుడు పై నాలుగు నగరాల నుండి హైదరాబాద్ కు వచ్చిన వాళ్ళు ఇపుడు విశాఖపట్నంకు వెళ్ళలేరా ? అయినా విశాఖపట్నంలో ఉండే రాజధానితో ఎవరికైతే పనుంటుందో వాళ్ళు మాత్రమే వెళతారు  మిగిలిన వాళ్ళకు ఏమి పని ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: