దేశ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. చలి తీవ్రత పెరిగిపోతుండడంతో పొగమంచు దట్టంగా కమ్ముకున్న ఉంది. దీంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి పరిస్థితి ఏర్పడింది.దట్టంగా  కమ్ముకున్న పొగమంచు తో ఎంతో మంది ఆరోగ్య సమస్యలు వచ్చి కూడా బాధపడుతున్నారు. పొగమంచు కారణంగా ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికే భారీగా పేరుకుపోతున్న పొగమంచుతో ఎన్నో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది గాయాల పాలవుతున్నారు. ఇంకెంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. భారీగా పెరిగిపోయిన పొగమంచు కారణంగా ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక ఆస్తమా లాంటి వ్యాధులు ఉన్నవారికి అయితే భారీగా పేరుకుపోయిన పొగమంచుతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

 

 

 

 ఇప్పటికే పొగమంచు కారణంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అయితే ఈ పొగమంచు ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలో మరింత తీవ్రతరం ఆయన విషయం తెలిసిందే. దట్టంగా పొగమంచు పేరుకుపోయినప్పటికీ రోడ్డుపై ప్రయాణించడం తో రోడ్డు కనిపించక... రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా పొగమంచు ఆరుగురి ప్రాణాన్ని బలిగొంది. దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా దారి కనిపించక పోవడంతో రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా దారి కనిపించక పోవడంతో కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లినది .. దీంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 

 

 

 వివరాల్లోకి వెళితే... సంబల్  జిల్లా నుంచి ఢిల్లీకి ఓ కారు  బయలుదేరింది. అయితే ఉదయం సమయం కావడంతో దట్టమైన పొగమంచు మొత్తం కమ్ముకు  పోయి ఉంది. కనీ రహదారి కూడా కనిపించని పరిస్థితి ఉంది. దీంతో దారి కనిపించకపోవడంతో కారు అదుపు తప్పి ఓ కాలువలోకి దూసుకెళ్లినది . దీంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పొగ మంచు  కారణంగానే ముందున్న దారి కనిపించక పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఢిల్లీలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. విమానాలను దారి మళ్లించారు. ఉత్తర రైల్వే పరిధిలో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: