జగన్మోహన్ రెడ్డిని చివరకు ఈయన కూడా బెదిరిస్తున్నాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటి చేస్తే  ఎన్ని ఓట్లు వస్తాయో కూడా తెలీదు ఈయనకు.  అందుకనే ధనబలంతో చంద్రబాబునాయుడుకు దగ్గరై రాజ్యసభ సభ ఎంపిగా చెలామణి అవుతున్న సుజనా చౌదరి @ యలమంచిలి సత్యనారాయణ చౌదరి కూడా రాజధాని ప్రతిపాదనపై జగన్ కు వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ’రాజధాని అమరావతి నుండి అంగుళం కదలినా ఊరుకోం’ అంటూ తీవ్రంగా హెచ్చరించేశారు.

 

జగన్ కు వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టేందుకు సుజనా రాజధాని గ్రామాల్లో పర్యటించారు. కేంద్రంతో మాట్లాడిన తర్వాతే తాను  జగన్ ప్రభుత్వాన్ని హెచ్చిరిస్తున్నట్లు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. అదే సమయంలో సుజనా మాటలతో తమకు సంబంధం లేదని కొందరు బిజెపి నేతలు చెబుతున్నారు. అంటే సుజనా వార్నింగులకు కేంద్రప్రభుత్వం మద్దతుందో లేదో తెలీటం లేదు. మొత్తానికి చంద్రబాబు మనిషిగా బిజెపిలోకి వెళ్ళిన సుజనా తనవంత పాత్రను బాగానే పోషించే ప్రయత్నం చేస్తున్నట్లే ఉంది.

 

ప్రతిపక్షంలో ఉన్నపుడు అమరావతికి మద్దతు పలికిన జగన్ ఇపుడు రాజధానిని ఎందుకు మారస్తున్నారు ? అంటూ అడిగారు. నిజానికి  అమరావతికి జగన్ మద్దతు పలికింది వాస్తవమే. కానీ రాజధాని కోసం ప్రభుత్వం ప్రభుత్వ భూములనే వాడుకోవాలని చేసిన సూచనను మాత్రం పక్కన పెట్టేశారు. అమరావతికి జగన్ మద్దతిచ్చిన తర్వాత చంద్రబాబు తనిష్టం వచ్చినట్లు వ్యవహరించారు.

 

భూసమీకరణ ద్వారా రాజధాని నిర్మిస్తానని, స్విస్ చాలెంజ్ ద్వారా సింగపూర్ కంపెనీలతో అగ్రిమెంట్  చేసుకుంటానని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పలేదు. కేవలం రాజధానిగా అమరావతిని ఎంపిక చేశానని మాత్రమే చెబితే దానికే జగన్ మద్దతు పలికారు. కానీ జగన్ చెప్పినట్లుగా ప్రభుత్వ భూమిని కాకుండా వేలాది ఎకరాలను సమీకరించారు. ఈ విషయాలను సుజనా కానీ టిడిపి నేతలు కానీ ఎక్కడా ప్రస్తావించటం లేదు.  రాజధానికి కేవలం రూ 8 వేల కోట్లు చాలని ఇపుడు చెబుతున్న సుజనా మరి రూ. 1.10 లక్షల కోట్లు కావాలని చంద్రబాబు చెప్పినపుడు ఏమవసరమని ఎందుకు అడగలేదు ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: