ఈమధ్య మద్యం కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది... ఆడ మగ తేడా లేకుండా మద్యానికి బానిసలై పోతున్నారు. చదువుకునే వయసు నుంచి మద్యానికి బానిసై... చదువులను వదిలేస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణం లో డిగ్రీ విద్యార్థినిలు మద్యం సేవించడం సంచలనంగా మారింది. మైలాదుత్తురై పట్టణంలోని ధర్మాపురం అధీనం ఆర్ట్స్ కళాశాలలో నలుగురు యువతులు డిగ్రీ చదువుతున్నారు... ఓ  యువతి బిఏ లిటరేచర్లో రెండో సంవత్సరం చదువుతోండగా ... ఇంకో ముగ్గురు విద్యార్థినిలు బిబిఏ రెండవ సంవత్సరం చదువుతున్నారు. అయితే నలుగురు విద్యార్థిని లో ఒక అమ్మాయి పుట్టినరోజు కావడంతో తమ కళాశాలకు పది కిలోమీటర్ల దూరంలోని సితార్  కదు గ్రామంలో... నలుగురు విద్యార్థిని ల్లో  ఒక అమ్మాయి ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారు. 

 


 ఈ మందు పార్టీలో  ముగ్గురు అమ్మాయిలు కాలేజ్ యూనిఫామ్ లో ఉండడంతో పాటు వారితో మగ  స్నేహితులు కూడా కలిసి మద్యం సేవించారు. ఈ నలుగురు అమ్మాయిలు మద్యం సేవిస్తుండగా ఓ స్నేహితుడు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో అటుపక్క ఇటుపక్క తిరిగి  ఏకంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ స్వామినాధన్ వరకు వెళ్ళింది. దీంతో తల్లిదండ్రులకు కాలేజీ కి వస్తున్నాము  అని చెప్పి కళాశాల యూనిఫామ్ లోనే మద్యం సేవించిన విద్యార్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కళాశాల ప్రిన్సిపల్ స్వామినాథన్. తమ కళాశాల విద్యార్థులను మద్యం తాగడం కళాశాల నిబంధనలకు విరుద్ధమని మద్యం పార్టీ చేసుకున్న సమయంలో కళాశాల యూనిఫామ్ ధరించి ఉన్నందున.. ఈ ఘటనతో కళాశాల ప్రతిష్టకు భంగం వాటిల్లింది అంటూ ప్రిన్సిపల్ స్వామినాథన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 


 ఇక కళాశాల అమ్మాయిలు కళాశాల యూనిఫాంలో మద్యం తాగిన ఘటనను తీవ్రంగా ఖండించిన కళాశాల యాజమాన్యం సదరు మద్యం తాగిన  నలుగురు యువతులను తమ కళాశాల నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. తమ కళాశాల ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకే మద్యం తాగిన నలుగురు అమ్మాయిలను కళాశాల నుంచి తొలగిస్తున్నట్లు భారతిదాసన్  యూనివర్సిటీ రిజిస్టర్ గోపీనాథ్ వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి అంటూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ను ఆదేశించారు వర్సిటీ రిజిస్ట్రార్. కాగా స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: