రాజధానిగా  విశాఖపట్నమే కరెక్టంటూ టిడిపి ఎంఎల్ఏ పెద్ద బాంబు వేశారు. ఒకవైపు రాజధానిని అమరావతి నుండి వాశాఖపట్నకు తరలించేస్తారంటూ చంద్రబాబునాయుడు అండ్ కో గోల చేస్తున్న సమయంలోనే  జగన్మోహన్ రెడ్డికే తన మద్దతంటు గుంటూరు వెస్ట్ ఎంఎల్ఏ మద్దాలి గిరి  పార్టీ అధినేతకు పెద్ద షాకిచ్చారు.  రైతులను జగన్ మోసం చేస్తున్నాడని  చంద్రబాబు చేసిన ఆరోపణలను టిడిపి ఎంఎల్ఏ తిప్పికొట్టారు.

 

అసలు రైతులను మోసం చేసిందే చంద్రబాబు అని చెప్పకనే చెప్పారు. రైతులు ఈరోజు రోడ్లమీదకు వచ్చి ఇంత గోల చేయటానికి కారణమే చంద్రబాబు అంటూ మండిపోయారు. ఐదేళ్ళ కాలంలో  రాజధానికి కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టిన చంద్రబాబు అమరావతికి తానేదో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేశాని చెప్పటమే విచిత్రంగా ఉందన్నారు.

 

అధికారంలో ఉన్నంత కాలం కేవలం గ్రాఫిక్స్ లో మాత్రమే అమరావతి భవనాలను చూపించిన చంద్రబాబు ఇపుడు జగన్ అభివృద్ది చేసి చూపిస్తానని చెబుతుంటే గోల చేయటమేంటి ? అంటూ నిలదీశారు. ఆర్దిక మాంధ్యంలో కూడా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రణాళిక బాగున్నాయన్నారు.  తన నియోజకవర్గంలో ఎన్నో సమస్యలున్నాయని వాటి పరిష్కారం కోసం మాత్రమే తాను జగన్ ను కలిసినట్లు చెప్పారు.

 

విశాఖపట్నాన్ని జగన్ రాజధానిగా ప్రతిపాదించినంత మాత్రాన రైతులు గోల చేయాల్సిన అవసరం లేదన్నారు.  ఇక్కడి రైతులందరికీ జగన్ న్యాయం చేస్తానని తనతో చెప్పినట్లు గిరి చెప్పటమే విచిత్రంగా ఉంది. అదే సమయంలో వైసిపిలో చేరుతున్నారా అన్న ప్రశ్నకు ఎంఎల్ఏ అసలటువంటి చర్చే జరగలేదని చెప్పటం గమనార్హం.

 

ఈరోజు జగన్ తో భేటి తర్వాత గిరి మాట్లాడిన విషయాలు వింటుంటే ఎన్నో రోజులు టిడిపిలో కంటిన్యు అయ్యే అవకాశం లేదనే అనిపిస్తోంది. బహుశా గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ బాటలోనే తాను కూడా నడిచే అవకాశాలున్నట్లు ఎంఎల్ఏనే చెప్పారు. ఎందుకంటే ఉదయం గుంటూరు జిల్లా నేతలతో చంద్రబాబు భేటిలో కూడా గిరి కనబడలేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు అడిగినపుడు ఎంఎల్ఏ గురించి తమకు తెలీదని మిగిలిన నేతలు చెప్పటంతోనే చంద్రబాబుకు షాక్ తగిలినట్లైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: