వైజాగ్ ప్రాంతాన్ని రాజధాని గుర్తించడంతో తెలుగుదేశం పార్టీ నేతలు వైసిపి పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు విషయం మనకందరికీ తెలిసిందే. అమరావతి ప్రాంతంలో ఉన్న రాజధానిని మార్చడం పట్ల ఆ ప్రాంతంలో ఉన్న రైతులతో తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ పార్టీలో ఉండే కీలక నాయకులపై మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో ఇటీవల విరుచుకుపడ్డారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం క్యాపిటల్ సిటీ ఎంపికలను స్టడీ చేయడం కోసం అధ్యయనం చేయడం కోసం  బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బిసిజి) లో దూసుకెళ్లింది మరియు జిఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదికతో పాటు దాని ఫలితాలను కూడా తీసుకోవడానికి ఇష్టపడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బిసిజి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఆ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వెనుక వైసిపి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపి విజయ్ సాయి రెడ్డి సొంత అల్లుడు ఉన్నారని టిడిపి సీనియర్ నాయకుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.

 

విజయ్ సాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ డైరెక్టర్ భట్టాచార్యతో సన్నిహితంగా ఉన్నారని వర్ల రామయ్య ఆరోపించారు. రోహిత్ రెడ్డి అరబిందో ఫార్మా కంపెనీ ప్రమోటర్. రోహిత్ రెడ్డి యాజమాన్యంలోని అరబిందో ఫార్మా కంపెనీ వైజాగ్ మరియు విజయనగరం మధ్య వేల ఎకరాల భూములను కలిగి ఉందని, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ యొక్క నివేదిక రోహిత్ రెడ్డికి అనుకూలంగా ఉంటుందని వర్ల రామయ్య ఆరోపించారు. అయితే అది అతి పెద్ద కంపెనీ కావడంతో చాలామంది బోస్టన్ గ్రూప్ లో చాలా మంది పని చేస్తుంటారు .. దీన్ని పట్టుకుని వివాదం చెయ్యడం దారుణం అంటున్నారు.

 

కావాలని ఇరికించే ప్రయత్నం తప్ప వర్క్ ఔట అవదు అని వేరే రకంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆలోచిస్తే బాగుంటుంది అని ఆ కంపెనీ విషయంలో వైసీపీ ప్రభుత్వం పై బురద జల్లడం అంత ఈజీ కాదని సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు. కేవలం విజయసాయిరెడ్డి యొక్క అల్లుడిని ఇరికించి రాజకీయ లబ్ది పొందాలని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలని వైసిపి పార్టీ నేతలు మరో పక్క వర్ల రామయ్య చేసిన కామెంట్లను పట్టించుకోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: