ఈ మధ్యకాలంలో నాటు బాంబులు ఎక్కువగా పేలుతున్నాయి. దీపావళి పండుగా సమయంలో హైదరాబాద్ నగర శివారులో పేలి కలకలం సృష్టించిన నాటు బాంబు ఇప్పుడు మళ్ళి ఆదిలాబాద్ జిల్లాలో పేలి ఒక్కసారిగా అలజడి సృష్టించింది. ఈ నాటు బాంబు కారణంగా ఓ వ్యక్తి  తునాతునకలయ్యి అక్కడిక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. 

                                  

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర యావత్మాల్‌ జిల్లా అర్లీ ప్రాంతానికి చెందిన రాథోడ్ మానీరావు, శనీరావు అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై నాటు బాంబులను తరలించే సమయంలో ఈ నాటు బాంబులు పేలడం గుర్తించినట్టు పోలీసులు చెప్తున్నారు. వారి సొంత ఊరు అయినా ఉట్నూర్‌ మండలం గాదిగూడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం.

                               

పొలాల్లోకి వచ్చే అడవి పందులను చంపడానికి ఈ నాటు బాంబులను ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఈ ప్రమాదం ఉట్నూరు క్రాస్‌రోడ్డులో మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వ్యక్తి శరీర భాగాలు తునాతునకలు అయ్యి చెల్లాచెదురుగా పడిపోవటడంతో అక్కడ ఉన్న వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యి పోలీసులకు సమాచారం అందించారు. 

                        

కాగా తీవ్రంగా గాయపడిని వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వైపు ప్రమాదం జరిగిన ఘటన రక్తపు మరకలతో శరీరం అంత చిన్నాభిన్నం అయి ఘటన స్థలం రూపురేఖలు మారిపోయాయి. మరో వైపు అక్కడే ఉన్న నాలుగు పేలని బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: