ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల రగడ ఇప్పట్లో చల్లారేలా లేదనిపిస్తుంది. ఎందుకంటే రోజుకు ఎవరో ఒకరు ఈ విషయం పై సంచలన వాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. ఈ పరిస్దితుల్లో కొందరిలో ఆందోళన కూడా మొదలైంది. ఇదిలా ఉండగా ఈ విషయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర నేతల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం నడుస్తోంది. ఎవరికి వారు పార్టీల వారీగా తమ వాదనల్ని వినిపిస్తున్నారు. ఈ సందర్భంలో తాజాగా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ కూడా తన నోరువిప్పి మూడు రాజధానుల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

 

సీయం పీఠాన్ని అధిరోహించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అయినా ఇప్పటి వరకు సీమకు అన్యాయం చేస్తు, నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని టీజీ వెంకటేష్ మండిపడ్డారు. ఇదే కాకుండా తమ ప్రాంతం వారైన మంత్రుల్లొ ఒకరు అమరావతి పరిగెత్తగా. మరొకరు విశాఖ పరిగెత్తారు. అన్ని ప్రాంతాలు కలసి ఉండాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఒకే ప్రాంతం డెవలప్ అయితే, హైదరాబాద్ నుంచి తరిమేసినట్టు మళ్లీ అదే పరిస్థితి  వస్తుంది. అప్పుడు మూడు రాష్ట్రాలు అయ్యే అవకాశాన్ని కల్పించినట్టు అవుతుంది. అని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు.

 

 

ఇప్పుడు నేను ఒక్కటే ‘రాయలసీమ తరఫున  అడుగుతున్నా. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ రాజధాని ఉండేది. విడిపోయాక రాజధాని బంగారు పళ్లెంలో తీసుకెళ్లి అమరావతిలో పెట్టారు. అమరావతి వెళ్లడమే చాలా కష్టం అంటే, ఇప్పుడు జగన్ అదే రాజధానిని బంగారు పళ్లెంలో తీసుకెళ్లి విశాఖలో పెడుతున్నారు. ఇకపోతే భవిష్యత్‌లో ఆ రెండూ అభివృద్ధి అయ్యాక రాయలసీమ వాళ్లను తరిమేయరన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు. ఇక రాయలసీమలో సచివాలయం ఏర్పాటు చేయాలని.. లేదంటే మూడు చోట్లా అసెంబ్లీలు ఉండాలనే కొత్త ప్రతిపాదనను టీజీ వెంకటేష్ తెరపైకి తీసుకొచ్చారు.. ఇప్పటికైనా ఏపీ ప్రజలను మభ్యపెట్టడం మానేసి అందరికి ఓ క్లారిటి వచ్చేలా  విషయాన్ని తెంచితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: