భార‌తదేశ మొట్ట‌మొద‌టి సైన్యాధిప‌తిగా ఎంపికైన బిపిన్ రావ‌త్ ప‌ద‌వీ స్వీకారానికి ముందే.. పొరుగునే ఉన్న‌ప్ప‌టికీ..ప‌క్క‌లో బ‌ల్లెంలా మారిన పాకిస్థాన్‌కు షాకిచ్చారు. ఆర్మీ చీఫ్‌గా రావ‌త్ ఇవాళ రిటైర్ అయ్యారు. ఆయ‌న్ను సీడీఎఫ్ చీఫ్‌గా నియ‌మించిన విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రి ఒక‌ట‌వ తేదీన రావ‌త్‌.. సీడీఎఫ్ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. పార్ల‌మెంట్ వ‌ద్ద సౌత్ బ్లాక్‌లో ఆర్మీ చీఫ్‌కు ఫేర్‌వెల్ ప‌లికారు. ఈ సంద‌ర్భంగా గౌర‌వ వంద‌నం ఏర్పాటు చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ...ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

 

సైన్యాధిప‌తి రావ‌త్ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద పుష్ప‌గుచ్చం ఉంచి నివాళి అర్పించారు. సైన్యాధిప‌తిగా బాధ్య‌త‌లను ముగిస్తున్న‌ట్లు బిపిన్ రావ‌త్ మీడియాకు తెలిపారు. విప‌త్క‌ర స‌మ‌యాల్లో దృఢంగా నిలిచిన భార‌త ఆర్మీలోని సైనికులు, ర్యాంక్ ఆఫీస‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 28వ ఆర్మీ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న జ‌న‌ర‌ల్ మ‌నోజ్ న‌ర‌వాణేకు రావ‌త్ కంగ్రాట్స్ చెప్పారు. పాక్‌, చైనా స‌రిహ‌ద్దుల వ‌ద్ద స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు భార‌త ఆర్మీ సిద్ధంగానే ఉంద‌ని బిపిన్ తెలిపారు. ఇవాళే ఆర్మీ చీఫ్‌గా రిటైర్ అయ్యాను, ఆర్మీ చీఫ్‌గా ఎన్నో బాధ్య‌త‌లు ఉంటాయి, ఇన్నాళ్లూ వాటిమీదే దృష్టి పెట్టాను.  సీడీఎస్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత త‌న పాత్రపై కొత్త వ్యూహాన్ని ర‌చిస్తాను. `` అని పాక్‌కు ఆదిలోనే షాకిచ్చారు.

 

ఇదిలాఉండ‌గా, భారత ఆర్మీ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. బిపిన్‌ రావత్‌ స్థానంలో సైన్యాధిపతిగా జనరల్‌ నరవణే బాధ్యతలు చేపట్టారు. ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన నరవణే.. 28వ సైన్యాధిపతిగా నిలిచారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ నరవణే.. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. పుణెలోని జనన ప్రబోధిని పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉన్నత విద్యను పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీలో పూర్తి చేశారు. డిఫెన్స్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ డిగ్రీని చెన్నైలోని మద్రాస్‌ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇండోర్‌లోని దేవీ అహిల్య విశ్వవిద్యాలయంలో డిఫెన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంఫిల్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: