తాను చేస్తున్న పోరాటాలు దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్వరి రంగంలోకి దించాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ఆమెను రాజకీయంగా యాక్టివ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు భువనేశ్వరిని తీసుకువెళ్లి అక్కడి నుంచి ఆమెను రాజకీయంగా యాక్టివ్ చేయాలనేది చంద్రబాబు ఆలోచన.


 రాజధాని గ్రామాల్లో రైతు కుటుంబాలకు చెందిన మహిళలు ఆందోళనలో పాల్గొంటున్నారు. వారికి మద్దతుగా భువనేశ్వరిని అక్కడికి తీసుకు వెళ్లడం ద్వారా ఉద్యమానికి మరింత ఊపు తీసుకురావచ్చు అనేది చంద్రబాబు రాజకీయ వ్యూహంగా తెలుస్తోంది. ఇక అక్కడ అవసరమైతే అక్కడి నుంచే ప్రజల మధ్యలో భువనేశ్వరి తో వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేయించే దిశగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తుళ్లూరు, వెలగపూడి తదితర గ్రామాల్లో భువనేశ్వరితో పర్యటన చేయించేందుకు చూస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం బాబు లోకేష్ కు ప్రజాదరణ తగ్గిన నేపథ్యంలో ఇలా మహిళా సానుభూతి సంపాదించుకునే దిశగా భువనేశ్వరిని రంగంలోకి బాబు దించుతున్నాడు అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. 

 

అమరావతిలో భువనేశ్వరి పర్యటన విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాల్లో ఆమె పాలు పంచుకునేలా చేయాలని చూస్తున్నాడు బాబు. ఈ మేరకు ఇప్పటికే ఆమెకు రాజకీయంగా ఎలా వ్యవహరించాలి అనే విషయంపైనానా, రాజకీయ విమర్శలపైనా ఏ విధంగా స్పందించాలి అనే దానిపై ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించినట్టుసమాచారం. ఎన్టీఆర్ కుమార్తెగా భువనేశ్వరికి ప్రజల్లో ఆదరణ బాగానే దక్కుతుందని, వైసీపీ నుంచి కూడా విమర్శలు పెద్దగా ఉండవని ఈ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతుందని చంద్రబాబు ప్లాన్. 


అయితే బాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందా అనేది అనుమానమే. చంద్రబాబు, లోకేష్ ఇమేజ్ తగ్గడం తోనే ఇలా భువనేశ్వరి రంగంలోకి దించి బాబు అవకాశవాద రాజకీయాలకు తెర లేపారు అనే భావన ప్రజల్లో కనుక ఎక్కువయితే మొదటికే మోసం వస్తుందని మరికొంతమంది తెలుగు తమ్ముళ్ళు మనసులో మాట .

మరింత సమాచారం తెలుసుకోండి: