వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో సరళాసాగర్‌ జలాశయానికి భారీ గండి కొట్టారు. సరళాసాగర్‌ జలాశయం పూర్తి స్థాయిలో నిండింది. దీంతో ఆ జలాశయం నుండి లీకేజీలు, ఆటోమేటిక్‌ సైఫన్‌ సిస్ట తెరచుకోకపోవడంతో కట్టపై ఒత్తిడి అధికమైంది. దీంతో ఆ జలాశయం ఎడమవైపు ఆనకట్ట తెగిపోయింది. అంతేకాదు ఈ జలాశయం నీటిమట్టం ప్రస్తుతం పూర్తి స్థాయి 22 అడుగులకు చేరింది. సుమారు అర టీఎంసీ నీటి నిల్వతో కొనసాగుతోంది. 

                   

ఈ నీరంతా సరళాసాగర్‌ జలాశయం నుంచి దిగువప్రాంతాలకు చేరిపోతుంది. అయితే కొత్తపల్లి వాగుకు రెండు వైపులా ఉన్న నారుమళ్లు విద్యుత్‌ మోటార్లు కొట్టుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాదు మదనాపురం వద్ద కొత్తకోట ఆత్మకూరు రహదారి కాజ్‌వేపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రామన్‌పాడు జలాశయంపైనా ఒత్తిడి పెరగడంతో 19 గేట్లకు గాను 9 గేట్లు తెరచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. 

 

ఆసియాలోనే ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థ ఈ ప్రాజెక్టుకు ఉన్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. గతంలో కరకట్ట నుంచి పలు చోట్ల లీకేజీలు గుర్తించినా అధికారులు పట్టించుకోలేదని అక్కడ ఉన్న రైతులు వెల్లడించారు. ఘటనా స్థలానికి వ్యవసాయ మంత్రితోపాటు, జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే చేరుకొని పరిశీలిస్తున్నారు. జలాశయంలోని నీరంతా బయటకు పోయాక, కరకట్ట పునర్నిర్మాణం చేపట్టే అవకాశముందని అధికారులు తెలిపారు.

 

నీటి ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని ఒక్కోగేటు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నీరంతా ఊకచెట్టువాగు ద్వారా కృష్ణానదిలోకి చేరుతుంది. 2009 తర్వాత రామన్‌పాడుకు వరద రావడం ఇదే మొదటి సారి. ఊకచెట్టు వాగు సైతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాదు గండీ పడి నీరంతా బయటకు పోతుండటంతో ఇక తమకు సాగునీరు ఇబ్బంది అవుతుంది అని రైతులు ఆవేదన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: