జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక అవకాశం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ ని టార్గెట్ చేసుకుని అనేక రీతులుగా ఇబ్బందుల పాలు చేయడానికి అవకాశం కోసం గత కొంత కాలం నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఇసుక అని అలాగే ఇంగ్లీష్ మీడియం అని తరువాత మతాలు ఇంకా అనేక రీతులుగా పవన్ కళ్యాణ్ ప్రయత్నించిన ప్రజలలో జగన్ పై ఏ మాత్రం వ్యతిరేకత రాని నేపథ్యంలో ఇటీవల విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో కామెంట్ చేయడం జరిగింది.

 

అంతేకాకుండా ఒక చోట మాత్రమే అభివృద్ధి జరిగితే అది రాబోయే రోజుల్లో రాష్ట్రం ముక్కలు అవటానికి ఆస్కారం ఉందని గతంలో హైదరాబాదు ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి జరగడం వల్ల చాలా నష్టపోవటం జరిగిందని ...భవిష్యత్తులో అటువంటి తప్పు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకుండా ఉండాలంటే మూడు ప్రాంతాలలో అభివృద్ధి చెందాలని జగన్ తెలపడం జరిగింది. దీంతో అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు మరియు టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ చేసిన ప్రకటన పట్ల గత కొన్ని రోజుల నుండి ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో అమరావతిలో పర్యటించడానికి ఆవేశంతో రెడీ అయిన పవన్ కళ్యాణ్ కి పోలీసులు తగ్గించుకో అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

 

మేటర్ ఏమిటంటే మందడం సమీపంలో జనసేనానిని పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణాయపాలెం నుంచి మందడం మీదుగా మంగళగిరి వెళ్తుండగా.. పోలీసులు ఆపారు. అక్కడ నుంచి నేరుగా తుళ్లూరు వెళ్లాలని సూచించారు. పవన్ కాన్వాయ్‌ వెళ్లకుండా తాళ్లతో అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పవన్ కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో జనసైనికులు, స్థానిక రైతులు పోలీసులపై మండిపడ్డారు. ఇటువంటి తరుణంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో అమరావతికి ఎందుకు అనుకూలంగా మాట్లాడారు జగన్ అంటూ ప్రశ్నలు కురిపించారు పవన్.

 

ఇటువంటి తరుణంలో మరో పక్క రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలు కేవలం పవన్ కళ్యాణ్..చంద్రబాబు కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు ఉందని అభివృద్ధి అన్ని చోట్ల జరిగితే తప్పు ఏమి ఉందని అంటున్నారు. అమరావతిలో రాజధాని లేకుండా ఏమీ లేదు ఆ ప్రాంతంలో రాజధాని ఉంటుంది కానీ మిగతా చోట్ల కూడా ఉంటే తప్పేమిటని..నిజంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పార్ట్నర్ లా వ్యవహరిస్తున్నారని..అందువల్లనే 2019 ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తరపున నారా లోకేష్ పోటీ చేస్తున్న సమయంలో జనసేన పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టకుండా పవన్ కళ్యాణ్ కామ్ గా ఉన్నారని..  అమరావతి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలు మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: