చంద్రబాబునాయుడులో రోజు రోజుకు శాడిజం పెరిగిపోతోంది. చెప్పుకోవటానికే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కానీ ఆచరణలో మాత్రం ఆ అనుభవం ఎక్కడా కనబడటం లేదు. జాతీయ స్ధాయిలో తనకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ ను చివరకు జగన్మోహన్ రెడ్డిని తిట్టించటానికే ఉపయోగిస్తున్నట్లుంది.  ’ది ప్రింట్’  ఎడిటర్  ఇన్ చీఫ్ శేఖర్ గుప్తా జగన్ పై విడుదల చేసిన వీడియో చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమైపోతుంది.

 

ఢిల్లీలో ఉన్న శేఖర్ కు అర్జంటుగా జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల మీద వీడియో చేయాలనిపించింది. నిజానికి ఈ ప్రముఖ పాత్రికేయునికి ఏపితో ఎటువంటి సంబంధమూ లేదు. ఇక్కడి రాజకీయ వ్యవహారాలపై అవగాహన కూడా లేనట్లే అనిపిస్తోంది. ఎందుకంటే మూడు రాజధానుల ప్రతిపాదనపై జగన్ ను నోటికొచ్చినట్లు తిట్టటం చూస్తుంటే  శేఖర్ సొంత బుద్ధితో వ్యాఖ్యలు చేసినట్లు లేదు.

 

మూడు రాజధానుల ప్రతిపాదనను ఈ పాత్రికేయుడు పిచ్చితుగ్లక్ చర్యగా అభివర్ణించారు. గ్రీన్ ఫీల్డ్ రాజధాని అమరావతి స్పూర్తిని జగన్ దెబ్బకొట్టారట. దేశం మొత్తం మీద కీలకమైన నగరంగా ఎదగాల్సిన అమరావతిని జగన్ చేతులారా పాడు చేసేస్తున్నారట. జగన్ చేష్టలన్నీ రాష్ట్రాభివృద్దికి గొడ్డలిపెట్టుగా మారిందట. కాబట్టి అర్జంటుగా ప్రధానమంత్రి జోక్యం చేసుకుని జగన్ చర్యలను ఆపేయాలట.

 

అదే అదే మీ అనుమానం కరెక్టే. శేఖర్ చేసిన వ్యాఖ్యలన్నీ ఎక్కడో విన్నట్లే అనిపిస్తోంది కదూ ? నిజమే ఈ వ్యాఖ్యలన్నింటినీ  గడచిన ఏడు మాసాలుగా చంద్రబాబు నోటి నుండి వింటున్నవే. చంద్రబాబు మాటలనే శేఖర్ తన వీడియో ద్వారా విడుదలచేశారు. అంటే చంద్రబాబే ఈ పాత్రికేయునితో జగన్ ను తిట్టిస్తారు. శేఖర్ విడుదల చేసిన వీడియోను పట్టుకుని  జగన్ చేష్టలపై ప్రముఖ పాత్రికేయుడు శేఖర్ అభిప్రాయాలంటూ మళ్ళీ మీడియాలోను, ట్విట్టర్ ఖాతాలోను చంద్రబాబు వాయించేస్తుంటారు.

 

నిజంగానే వీళ్ళిద్దరిదీ ఫెవికాల్ బంధం. తాను చెబితే జాతీయస్ధాయిలో వినేవాళ్ళు, నమ్మేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి శేఖర్ గుప్తా ద్వారా మోడి, అమిత్ షా లను మ్యానేజ్ చేసేందకు చంద్రబాబు కుట్ర చేస్తున్నట్లే అనుమానంగా ఉంది.  చంద్రబాబు ఆడమన్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలా ఆడుతున్నాడో శేఖర్ కూడా అంతే. ఇదంతా చూస్తుంటే జగన్ విషయంలో  చంద్రబాబు శాడిజం ఎంతగా పెరిగిపోయిందో అర్ధమైపోవటం లేదూ

మరింత సమాచారం తెలుసుకోండి: