నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న యావత్ ప్రజానీకానికి అంతా శుభం కలగాలని అందరు కోరుకుంటారు. కాని రైల్వే శాఖ మాత్రం. తీపి కబురు మాట పక్కన పెడితే ఒక షాకింగ్ న్యూస్ తో సిద్దమైంది. అదేమంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయం విషయంలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న రైల్వే శాఖ ఆదాయం గణనీయంగా తగ్గడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై వేసే క్రమంలో ప్రయాణికుల ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే రైల్వే ఛార్జీల పెంపుపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే.

 

 

ఆ ఉహలు నిజం చేస్తూ, తాజాగా టికెట్‌ ధరలు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకోగా పెంచిన ధరలు జనవరి 1- 2020 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రైలు చార్జీలను మంగళవారం అర్ధరాత్రి నుంచి పెంచుతున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందుకు గాను అన్ని తరగతుల ప్రయాణీకుల చార్జీలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ఆర్డినరీ, నాన్‌-ఏసీ రైళ్లలో కిలోమీటర్‌కు పైసా చొప్పున, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కిలోమీటర్‌కు రెండు పైసలు చొప్పున చార్జీలను పెంచారు. ఏసీ క్లాస్‌కు కిలోమీటర్‌కు 4 పైసల చొప్పున చార్జీలను పెంచినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

 

ఇదిలా ఉండగా నరేంద్రమోదీ ప్రభుత్వం తొలిసారి అధికారంలో వచ్చిన 2014లో రైల్వే ఛార్జీలను పెంచారు. ఇకపోతే ఐదేళ్ల నుంచి రైల్వే చార్జీలను పెంచని దృష్ట్యా రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పుడున్న పరిస్దితిలో రైలు చార్జీలను పెంచక తప్పలేదని వెల్లడించింది.. ఇలా పెంచిన చార్జీల దృష్ట్యా రైళ్లలో ప్రయాణీకుల వసతి, సౌకర్యాలను మెరుగు పరుస్తామని, కోచ్‌ల ఆధునీకరణ, స్టేషన్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది...  మరి తాను ఇచ్చిన మాట ఎంతవరకు నిలపెట్టుకుంటుందో చూడాలని కొందరు అనుకుంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: