చేతిలో డబ్బులు ఉండాలే కాని లోకాన్నే ఏలవచ్చు. లక్షలల్లో డబ్బులుంటేనే ఆగని లోకంలో వందల వేయిల కోట్లు ఉన్న వారు ఇంకేం ఆగుతారు. వారికి నచ్చిన పని చేస్తారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు ప్రవర్తిస్తారు. ఇలాంటి వారు ఏ రంగంలో అడుగు పెట్టినా నష్టం అనేది దాదాపు వారి దరికి కూడా చేరదు. ఇంతలా ఎందుకు చెబుతున్నానంటే ముకేష్ అంబానీ అనే ధనవంతుడు ఇప్పుడొక కొత్త బిజినెస్ లోకి అడుగు పెడుతున్నాడు. బిజినెస్‌లు చేయడం ఆయనకు కొత్తేమి కాదు కాని మనకు కొత్త కదా అందుకే కొత్త బిజినెస్ అన్నాను.

 

 

ఇకపోతే తాజాగా దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు  షాకిస్తూ మరో సంస్థను ప్రారంభించింది. ఈ మరో సంచలనానికి నాంది ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొత్త ఏడాదిలో స్వాగతం పలికింది. ఇక రిలయన్స్‌ జియోతో దూసుకుపోయిన అంబానీ, తాజాగా ఈ కామర్స్ రంగంలోకి అడుగు పెట్టారు. జియో మార్ట్‌ పేరుతో ఆన్‌లైన్‌ గ్రాసరీ సంస్థను స్దాపిస్తున్నారు.. అయితే ఈ సేవలను మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద ముంబై, థానే  కళ్యాణ్‌ నగర్లో ప్రారంభించి, తర్వాత ఇండియా అంతట తన మార్కెట్ ను విస్తరించనుంది.

 

 

అదీగాక జియో మార్ట్ ద్వారా మూడు కోట్ల షాప్ లకు, 20 కోట్ల మంది కస్టమర్లకు చేరువయ్యేలా రిలయన్స్ అంచనా వేస్తుంది. ఇందుకు గాను రిలయన్స్‌ జియో మార్ట్‌ ద్వారా 50వేలకు పైగా సరుకులను విక్రయించాలని భావిస్తోంది.. అంతేకాదు తన కొత్త వెంచర్‌లో నమోదు చేసుకోవాల్సిందిగా జియో వినియోగ దారులకు ఆహ్వానాలు కూడా పంపింది. ఇకపోతే ముందుగా రిజిస్టర్‌ చేసుకున్న వారికి రూ.3వేల విలువైన కూపన్లను అందివ్వనుంది. వాటిని వినియోగదారులు జియో మార్ట్‌లో వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్‌ పొందవచ్చని తెలిపింది.ఇదే కాకుండా ఎలాంటి షరతులు లేకుండా ఉచిత హోమ్ డెలీవరీ,  తక్కువ సమయంలో త్వరగా డెలీవరీ వంటి సేవలు అందిస్తామని జియో మార్ట్ తన వెబ్ సైట్లో తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: