ఎన్నో మధురానుభూతులను చేదు అనుభవాలను తీపి జ్ఞాపకాలను నింపిన 2019 కి స్వస్తిపలికి 2020 సంవత్సరానికి సాదరంగా ఆహ్వానించి అడుగుపెట్టిన రోజు నేడు. ప్రపంచ దేశాలు మొత్తం కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా జరుపు కుంటున్నాయి. అంగరంగ వైభవంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటూ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాయి ప్రపంచ దేశాలు. కొత్త సంవత్సరం అంటే  ఇంటి ముంగిట రంగులతో రాతలు... ఎన్నో ఆలోచనలతో దేవుడి చేంత  పూజలు. ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరం అందరికీ ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా సాధించాలి అని ప్రతి ఒక్కరూ దృఢ  సంకల్పంతో ఉంటారు. 

 

 

 

 కొత్త సంవత్సరంలో సరి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. 2019లో ఓటమిపాలైనప్పటికీ 2020 లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. కొత్త జీవితం మొత్తం కొత్త ఆలోచనలకు దగ్గరగా ఉంటుంది. కొత్త వ్యాపారాలను మొదలు పెట్టడం లేదా కొత్త ఉద్యోగంలో చేరడం... భవనాలను నిర్మించడం ఇలాంటివి కొత్త సంవత్సరం సందర్భంగా చాలా మంది చేస్తుంటారు. కొత్త సంవత్సరం మొదటి రోజు జనవరి 1న ఎంతో మంచి రోజు గా భావిస్తూ ఉంటారు. ఇకపోతే సమయానికి ఎక్కడ సెలవు ఉండదు... సాగిపోతూనే ఉండటం తప్ప. అంతేకాకుండా మన కళలకి గడువు తీరే తేదీ కూడా ఉండదు. 

 

 

 

 ఎప్పుడూ కొత్త కలలు కంటూనే ఉంటాం. విరామమెరుగని మీ జీవితాన్ని ప్రేమిస్తూ... కొత్త సంవత్సరంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. మీ మొహం మీదికి ముడతలు తీసుకొచ్చే సంఘటనలతో  అనునిత్యం బాధపడకుండా.. మీ కళ్ళ లోకి మెరుపులు తీసుకొచ్చి జ్ఞాపకాలను పదిలం చేసుకుని కొత్త సంవత్సరంలో అనునిత్యం హ్యాపీ గా ఉండండి . ఈ సంవత్సరం లో చివరి రోజున ఎంత అద్భుతంగా మలుచుకున్నారో... అంతకుమించి అద్భుతంగా కొత్త సంవత్సరాన్ని మలుచుకుని సరికొత్త ఆనందమైన జీవితాన్ని ఆస్వాదించండి. కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి. సరికొత్త ఆలోచనలతో కొత్త సంవత్సరంలో మీ జీవితానికి కొత్త పునాదులు వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: