నిన్న ఏపీ రాజధాని అమరావతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన హంగామా గురించి అందరికీ తెలిసిందే. అమరావతిలోని రైతులతో కలిసి వారికి తానున్నానని భరోసా ఇవ్వడానికి బయలుదేరిన పవన్ ను అడ్డుకున్న పోలీసులు పై కొంచెం దూకుడుగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసుల ఆంక్షలను కాదని అతను రాజధాని గ్రామాల్లో కి వెళ్లడాన్ని కారణం గా చూపిస్తూ సెక్షన్ 144, 30 యాక్ట్ ప్రకారం ఆయన పై కేసు నమోదు చేయాలని ఉన్నత స్థాయిలో ఒత్తిడి వచ్చిందట.

 

అయితే పవన్ రాజధానికి పోలీసులు అనుమతి తీసుకునే వెళ్లగా ముఖ్యమంత్రి వస్తున్నారని ఆయన ఉదయం పెట్టుకున్న షెడ్యూల్ ను మార్చుకోవాలని పోలీసులు సూచించారు. ప్రోటోకాల్ ను గౌరవించిన పవన్ ఆ మేరకు తన షెడ్యూలు ను మార్చుకున్నా కూడా తర్వాత పోలీసులు ముఖ్యమంత్రి గారు సమీక్ష లో ఉన్నారని... మరియు ఆయన సచివాలయం నుండి వెళ్ళిపోయిన తర్వాతనే రాజధానిలో కి పవన్ కు అనుమతి ఇస్తామంటూ ఆయనను మందడం గ్రామంలోకి వెళ్లనీయకుండా గంటసేపు కూర్చోబెట్టారు. దీంతో సహనం కోల్పోయిన పవన్ కళ్యాణ్ ఇదంతా వ్యూహాత్మకంగానే జరుగుతున్న కుట్ర అని గుర్తించి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పవన్ కల్యాణ్ పర్యటనకు పోలీసులు అడుగడుగునా ఆటంకం కల్పించారు. అయితే.. ఎలాంటి గొడవలు జరగలేదు.

పోలీసు వారు వేసిన కంచె ను దాటుకొని పొలాలకు అడ్డంపడి కాలినడకనే మందడం గ్రామానికి వెళ్లి రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఇలా పవన్ వ్యవహరించిన తీరు నచ్చని ప్రభుత్వ పెద్దలు కంచె దాటినందుకు కేసు పెట్టమని పై స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఒకరోజు తర్వాత కేసు నమోదు చేయక తప్పలేదు అంటున్నారు. అయితే ఇలాంటి కేసుల కి తాము ఏమాత్రం భయపడేది లేదు అంటూ జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: