2019 సంవత్సరం వెళిపోతు చంద్రబాబునాయుడును టెన్షన్ లోకి నెట్టేసింది. సినియర్ నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు పై సిబిఐ కేసు నమోదు చేయటమే కాకుండా ఆయన వ్యవహారాలను మరింత లోతుగా దర్యాప్తు చేయాలని డిసైడ్ చేయటం చంద్రబాబును టెన్షన్ పెట్టేస్తోంది.  పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు అవినీతి సంపాదనకు వాడుకున్నాడని స్వయంగా నరేంద్రమోడి బహిరంగంగా ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే.

 

ఆ విషయంపైనే రాష్ట్రప్రభుత్వ సిఫారసుతో సిబిఐ రంగంలోకి దిగింది. పోలవరం ప్రాజెక్టు-ట్రాన్స్ ట్రాయ్ వ్యవహారాలపై సిబిఐ చాలా డీటైల్డ్ గా దర్యాప్తు చేసింది. దాని ప్రకారం వేలాది కోట్లరూపాయల  హెడ్ వర్క్స్ బిల్లుల చెల్లింపులో భారీ అవినీతి జరిగిందన్న విషయం బయటపడింది. చెల్లించాల్సిన బిల్లులను అప్పులు తీసుకున్న బ్యాంకుల ద్వారా కాకుండా  మరో బ్యాంకు నుండి చెల్లించారు. ఈ విషయంలో చంద్రబాబు ఆదేశాలతోనే జరిగినట్లు సిబిఐకి ఆధారాలు దొరికాయని సమాచారం.

 

అప్పులు తీసుకున్న బ్యాంకుల ద్వారానే బిల్లులు చెల్లిస్తే ముందుగా అప్పును సదరు బ్యాంకులు రికవరీ చేసేసుకుంటాయి.  బ్యాంకులకు అప్పులు చెల్లించడం రాయపాటికి ఇష్టం లేదట. అందుకనే తీసుకున్న అప్పుల్లో రూ. 795 కోట్లు ఎగ్గొట్టారట. బిల్లుల తాలూకు డబ్బు బ్యాంకు ఖాతాల్లో పడితే వాటిని బ్యాంకులు తీసేసుకుంటాయనే వేరే బ్యాంకు ద్వారా బిల్లులను రాయపాటి రాబట్టుకున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే అధికారులు రాయపాటి చెప్పిన బ్యాంకులో జమచేశారు.

 

 సరే అడ్డదిడ్డమైన పనులు ఎవరూ ఊరికే  చేయరు కదా ? అందుకనే తనకు సహకరించిన ఓ ముఖ్యనేతకు రాయపాటి రూ. 250 కోట్ల ముడుపులు చెల్లించినట్లు సిబిఐకి ఆధారాలు దొరికినట్లు సమాచారం. ఇదే విషయమై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు రాయపాటితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అంటే రాయపాటిని విచారణ నిమ్మితం అరెస్టు చేస్తే మరిన్ని విషయాలు బయటపడటం ఖాయం.  అపుడు ఆ రూ. 250 కోట్లు ఎవరికిచ్చారనే విషయం బయటకు వస్తుంది. 

 

ఈ విషయమే చంద్రబాబులో టెన్షన్ పెంచేస్తున్నట్లు తెలుస్తోంది. సంవత్సరం చివరిరోజున తన మిత్రుడిపై సిబిఐ కేసు పెట్టడంతో చంద్రబాబు బిత్తరపోయారు. విచారణలో రాయపాటి గనుక నోరిప్పితే మొత్తం ముడుపుల వ్యవహారమంతా బయటకొస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: