తెలుగుదేశంపార్టీలో నుండి వైసిపి వైపు వచ్చేయటానికి  మరో ఎంఎల్ఏ వెయిట్  చేస్తున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలోని టిడిపి తరపున గెలిచిన నలుగురు ఎంఎల్ఏల్లో అద్దంకి నుండి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ కూడా ఒకడు. మొన్నటి ఎన్నికల్లో టిడిపికి ఘోర ఓటమి ఎదురైన తర్వాత  చాలామంది పార్టీలో ఇమడలేక పోతున్నారు. ఇందులో భాగంగానే గొట్టిపాటి పార్టీలో నుండి ఎప్పుడెపుడు బయటకు వచ్చేద్దామా అని ఎదురు చూస్తున్నారట.

 

అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ ఎంఎల్ఏ చాలా సన్నిహితుడు. 2014లో వైసిపి తరపున గెలిచిన తర్వాత సమస్యలు మొదలయ్యాయి. టిడిపిలోకి రాకపోతే కేసులు పెడతామని చంద్రబాబునాయుడు వైపు నుండి బెదిరింపులు మొదలయ్యాయట. ఎందుకంటే జిల్లాలోని పెద్ద గ్రానైట్ వ్యాపారస్తుల్లో గొట్టిపాటి కూడా ఒకరు. అంతపెద్ద స్ధాయిలో వ్యాపారాలన్నాక ఏవో ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. దానికి తోడు విజిలెన్సు దాడులు, పోలీసు కేసులంటే చికాకే. అందుకనే వేరే దారిలేక గొట్టిపాటి టిడిపిలోకి ఫిరాయించారు.

 

సరే పార్టీలో చేరనైతే చేరారుకానీ చేరిన దగ్గర నుండి అద్దంకిలోనే ఉన్న సీనియర్ నేత, చిరకాల శతృవు కరణం బలరామ్ తో ఎప్పుడూ గొడవలే. వీళ్ళద్దరు రోడ్డున పడి కొట్టుకోవటం అప్పట్లో సంచలనమైంది. చంద్రబాబు ఎన్నిసార్లు పంచాయితీలు చేసినా ఉపయోగం కనబడలేదు.

 

సీన్ కట్ చేస్తే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత గొట్టిపాటికి అదే విధమైన ఇబ్బందులు మొదలయ్యాయట. దానికితోడు పార్టీలో కూడా సమస్యలు కంటిన్యు అవుతున్నాయట. పార్టీలోని నేతలెవరు కూడా టిడిపిలో కంటిన్యు అవటానికి ఇష్టపడటం లేదు. దాంతో గొట్టిపాటి కూడా తెలుగుదేశంపార్టీ నుండి బయటపడటానికి రెడీ అయిపోయినట్లు సమాచారం.

 

కాకపోతే వైసిపిలో చేర్చుకోవటానికి జగన్ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదట. ఎంఎల్ఏగా రాజీనామా చేయటానికైనా లేకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా కొనసాగటానికి కూడా గొట్టిపాటి రెడీ అయిపోయినట్లున్నారు.  టిడిపి నుండి బయటకు వచ్చేసిన  వల్లభనేని వంశీ అసెంబ్లీలో ఇండిపెండెంట్ గా ఉన్నారు. తాజాగా మద్దాలిగిరి కూడా దాదాపు టిడిపిలో నుండి వచ్చేసినట్లే.  అంటే ఇండిపెండెంట్ గా కంటిన్యు అవటానికి  గిరికి ఆర్ఏసి కన్ఫర్మ్ అయినట్లే.  గొట్టిపాటి ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లు లెక్క. మరెప్పుడు కన్ఫర్మ్ అవుతుందో చూద్దాం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: