ఆడవారు ఏ మాత్రం చనువు ఇచ్చినా.. వారి జీవితాలతో ఆడుకుంటున్నారు మదమెక్కిన మగాళ్లు. నేటి సమాజంలో ఆడవాళ్ళని మగవాళ్ళు ఎలా మోసం చేస్తున్నారో ప్రతిరోజూ వింటున్నా.. ఆ బాధితులు చేసిన తప్పులనే మిగతావాళ్ళు కూడా చేసి మళ్ళీ మళ్ళీ మోసపోతున్నారు. పెళ్ళికంటే ముందే సెక్స్ కోసం బలవంతం చేసే మగాళ్లు పచ్చి మోసగాళ్ళని ప్రతి అమ్మాయి ఎప్పుడు తెలుసుకుంటుందో అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు. 


ఇక వివరాల్లోకి పోతే, చెన్నై కు చెందిన సరస్వతి(24) అనే ఓ యువతి ఇంటికి దగ్గర్లో ఒక జిమ్(వ్యాయామశాల)ఉండేది. అదే ప్రాంతానికి చెందిన వీరమణి.. కానిస్టేబుల్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఆ జిమ్ కు వెళ్లి శరీర దారుఢ్యం పెంచుకునేవాడు. ఈ క్రమంలోనే సరస్వతికి లైన్ వేస్తూ వెళ్ళేవాడు. కొన్ని రోజుల తరువాత మాటలు కలిపాడు. సరస్వతి కూడా వీరమణితో మాట్లాడానికి ఇష్టపడేది. ఈ విధంగా కొన్ని రోజులు మాట్లాడుకున్న తరువాత వారి మధ్య స్నేహం ఏర్పడింది. 2 నెలల తరువాత వీరమణికి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. అలానే వారి స్నేహం ప్రేమగా మారింది.

ఆ తరువాత ఈ ప్రేమ జంట రెస్టారెంటులకు, సినిమాలకు, షికార్లకు బాగా తిరిగారు. ఒకరోజు వీరమణి సరస్వతిని తన ఇంటికి పిలిచాడు. ఎందుకు అని ఆమె ప్రశ్నించినప్పుడు.. తన అమ్మానాన్నలకు ఆమెను పరిచయం చేస్తానని చెప్పాడు. దాంతో, సరస్వతి వీరమణి ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఆ ఇంట్లో వీరమణి తప్ప మరెవ్వరూ లేరు. మీ అమ్మానాన్న ఎక్కడా అని సరస్వతి అడిగితే.. వాళ్లు గుడికి వెళ్లారని వీరమణి చెప్పి ఆమెను తన ఇంట్లోకి ఆహ్వానించాడు వీరమణి. అలా ఇంట్లోకి వచ్చిన సరస్వతితో పెళ్లి చేసుకుంటానని కాళ్ళు, గడ్డం పట్టుకొని నమ్మించి ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. ఆ తరువాత కూడా ఆమెను తన కామవాంఛ కోసం చాలా సార్లు వాడుకున్నాడు. దానికి ఫలితంగా ఆమెకు పండంటి బిడ్డ కూడా పుట్టింది.


దాంతో, పెళ్లి చేసుకోమని వీరమణిని అడిగింది సరస్వతి. కానీ అతడు మొహం చాటేసాడు. చాలా రోజుల వరకు సరస్వతితో మంచిగా మాట్లాడిన వీరమణి తల్లి కూడా .. 'నా  కొడుకు ఎస్ఐ జాబ్ లో జాయిన్ అవుతున్నాడు. వాడికి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తాం. నీ దారి నువ్వు చూసుకో.' అని చెప్పింది. మోసపోయానని ఆమెకు అప్పుడు అర్థమైంది. ఆపై సరస్వతి చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు వీరమణి దుసురుగా మాట్లాడిన కాల్ రికార్డింగ్ ను కూడా పోలీస్ స్టేషన్లో సమర్పించింది ఆ యువతి. అయితే వీరమణిని అరెస్టు చేయలేదని కేవలం విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: