ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ రాజకీయ వ్యూహాలకు ప్రత్యర్థి పార్టీలు దుకాణం సర్దుకునే పరిస్థితికి ఏర్పడ్డాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ని 2019 ఎన్నికల్లో చిత్తు చిత్తు చేసి ఓడించాడు జగన్. ఎన్నడూ లేని విధంగా దాదాపు 151 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోవడం జరిగింది. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులను కూడా ఆకర్షించే విధంగా జగన్ పరిపాలన చేస్తున్న తరుణంలో చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన గెలిచిన ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీలోకి రావడానికి ఇష్టపడుతున్నారు.

 

ఇటువంటి తరుణంలో వైసిపి పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో త్వరలోనే వైసిపి పార్టీ శాసనసభ స్థానాలు పెరిగే అవకాశం ఉందని 151 నుండి 153 వరకు వైసిపి పార్టీ ఎమ్మెల్యే స్థానాలు పెరగనున్నాయని ఇంకా అవసరమైతే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా వైసీపీ పార్టీలోకి రావడానికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మరియు మద్దాలి గిరిధర్ ఇష్టపడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే రాజీనామా చేసిన సంగతి మనం అందరం చూశాం.

 

మొదటిగా గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ హైకమాండ్ పై తిరుగుబాటు చేసి చంద్రబాబుపై ఆయన కుమారుడు నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేయడంతో పార్టీ వంశీ ని సస్పెండ్ చేయడం చూశాం. ఇదే తరుణంలో గుంటూరు జిల్లాకి చెందిన మద్దాలి గిరిధర్ కూడా ఇదే బాటలో రాజీనామా చేయటానికి రెడీ అయినట్లు త్వరలోనే టిడిపి పార్టీ ని వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా పోయే ఛాన్స్ ఎక్కువగా ఉండటంతో ఇదే పరిణామం వాస్తవమైతే ఒక్కసారిగా జగన్ మోహన్ రెడ్డికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లే అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: