ఏంటి అనుకుంటున్నారా ? అదేనండీ.. చంద్రబాబు బాటలోనే కోడలు బ్రహ్మీణి కూడా నడుస్తుంది. ఏదో ఒకటి లెండి కొడుకు ఎలాగో నడవలేకపోతున్నాడు. కనీసం కోడలు అయినా అతని బాటలో నడవనివ్వండి. ఏంటి ? అనుకుంటున్నారా ? అదే మామ చంద్రబాబుకి 'మాట ఇచ్చి తప్పడం వెన్నతో పెట్టిన విద్య' కదా.. గత నలబై ఏళ్లగా చంద్రబాబు అదే చేస్తున్నాడు. 

 

ఇప్పుడు కోడలు నారా బ్రహ్మణీ కూడా అదే బాటలో నడుస్తుంది అని అంటున్నారు నెటిజన్లు. ఇంకా కాస్త వివరాల్లోకి వెళ్తే.. ''స‌మస్యలు చెప్పుకొనేందుకు కుప్పం ప్రజల్లాగే.. మంగళగిరి ప్రజలకూ మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి'' ఉంటాయి అని ప్రజలకు మాట ఇచ్చింది నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి. ఈ మాట ఎప్పుడు ఇచ్చింది అబ్బా.. అనుకుంటున్నారా ? 

 

అదే గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో లోకేష్‌కు మద్దతుగా మంగళగిరిలో బ్రాహ్మణి ప్రచారం చేశారు. ఆ స‌మ‌యంలోనే ఈ హామీ ఇచ్చారు. వారంతా ఇక్కడే ఉంటున్నామని.. మంగళగిరి నియోజకవర్గంలోనే ఇల్లు, ఓటు హక్కు ఉన్నాయని ఆమె ప్రజలకు చెప్పారు. లోకేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని ఆమె కోరారు. అయితే, లోకేష్ మాత్రం ఘోరాతి ఘోరంగా ఆ ఎన్నికల్లో ఓట‌మి పాల‌య్యారు. 

 

అయితే గత ఏడు నెలల నుండి తెరపైకి రాని మాట ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. మంగ‌ళ‌గిరిలో కొంద‌రు రైతుల ఆందోళ‌న‌లు కారణంగా బ్రాహ్మ‌ణి హామీ తెరమీద‌కు వచ్చింది. రాజధాని అమరావతి మార్పుకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల్లో రైతులకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం మద్దతు ఇస్తూ తన రెండు చేతుల గాజులను ఇచ్చేసింది. 

 

అలాంటి మాజీ సీఎం భార్యే బరిలోకి దిగితే.. అక్కడే పోటీ చేసిన నారా లోకేష్ సతీమణి బ్రహ్మీని ఎందుకు రైతులకు మద్దతు ఇవ్వలేదు.. ఎన్నికల్లో హామీ ఇచ్చింది కదా.. మాట నిలబెట్టుకోవాలి కదా.. మామలాగే కోడలు కూడా మాట తప్పుతుందే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం బ్రహ్మణీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: