దేశంలో రోజురోజుకు మద్యం అమ్మకాలు  ఎక్కువైపోతున్నాయి. పండగ రోజు కాకుండా సరే మామూలు రోజుల్లో కూడా అత్యధికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఉద్యోగాలకు వెళ్లేవారు అయినా సరైన సమయానికి వెళతారో లేదో తెలియదు కానీ.. కరెక్ట్ గా వైన్ షాపులు ఓపెన్ చేసే సమయానికి మాత్రం మందు బాబులు ముందే అక్కడికి చేరుకుంటారు. ఎందుకంటే పొద్దున్నే ఓ పెగ్గు వేయకపోతే చాలా మంది మందుబాబులకు అసలు మైండ్ పనిచేయదు. అందుకే పొద్దున్నే కాస్త మందు  వేసిన తర్వాతే విధులకు కూడా వెళ్లే వాళ్ళు చాలామంది. ఇకపోతే మామూలు సమయాల్లోనే ఎగ బడి మరి వైన్ షాపుల ముందు జనాలు కనిపిస్తూ ఉంటారు. అందుకే మామూలు సమయాల్లో కూడా అత్యధికంగా మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. 

 

 

 అయితే మద్యం తాగి వాహనం నడిపిన లేకపోతే మద్యం తాగి రోడ్డుమీదకి వచ్చి హంగామా  చేసిన కఠిన చర్యలు తప్పవని పోలీసులు అటువైపు నుంచి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మందు బాబులు మాత్రం మందు మానరు. అంత కావాలంటే పోలీసుల నుంచి తప్పించుకుని పోతాము  కానీ మందు మానేయడం మాత్రం మా వల్ల కాదు బాబోయ్ అంటూ ఉంటారు. ఇక ఏదైనా పండుగలు వచ్చా యంటే మద్యం అమ్మకాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మామూలు సమయాల్లో నే మద్యం షాపుల దగ్గర కుప్పలు తెప్పలుగా కనిపించే జనాలు ఇక పండుగ సమయాల్లో అయితే భారీ క్యూ కట్టి మరి మద్యాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే రోజూ తాగింది వేరు పండుగ రోజు తాగింది వేరు కదా అంటుంటారు . 

 

 

 

 ఇకపోతే నూతన సంవత్సరం సందర్భంగా మద్యం ఏరులై పారుతూ  ఉంటుంది  అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు తాగని  వాళ్ళు కూడా ఫుల్లుగా తాగుతుంటారు. లేకపోతే ఇంకా కొంతమంది ఈ ఒక్కరోజు ఫుల్లుగా తాగేసి ఇక వచ్చే సంవత్సరం నుంచి అసలు మందు ముట్టొద్దని  బాగా తాగేస్తుంటారు. ఇక అటు  మద్యం షాపుల నిర్వాహకులు కూడా తమ వ్యాపారాన్ని భారీగా పెంచేసుకునేందుకు నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు పలు రెస్టారెంట్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లాలో జయశ్రీ వైన్స్ పెట్టిన ఆఫర్ ప్రస్తుతం కాస్త విచిత్రంగా... కాస్త ఆకర్షణీయంగా ఉంది. ఇంతకీ ఆఫర్  ఏంటి అనుకుంటున్నారా... 2000 లేదా అంతకు మించి విలువైన మద్యాన్ని కొనుగోలు చేస్తే ఒక సూపర్ కూపన్ ఇస్తామని ఆఫర్ పెట్టింది. ఇక ఈ లక్కీ డ్రాలో గెలిచిన ముగ్గురికి మొదటి బహుమతిగా ఎల్ఈడి టీవీ రెండో బహుమతి గా స్మార్ట్ఫోన్ మూడో బహుమతి గా వెండి నాణెం  ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. దీంతో ఎక్కువమంది ఈ వైన్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసీ... లక్కీ కూపన్ తీసుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: