న్యూఇయర్ వచ్చింది అంటే చాలు.. పీకల దాక తాగడం.. ఎంజాయ్ చెయ్యడం. అదేనా న్యూ ఇయర్ అంటే ? అదేనా ఎంజాయ్ అంటే ? సరే దీని గురించి ఎంత చెప్పిన వృధా.. ఎందుకంటే.. మనం ఎంత అనుకున్న చదివిన వారు మందుబాబులు అయినా సరే.. ఆ సరే సరేలే ఎన్నో అనుకుంటాం. ఆలా అని తాగకుండా ఉంటామా ఏంటి అని.. తగి చిందులు వేస్తారు. కొందరు అయితే మరి దారుణంగా హల్ చల్ చేస్తారు. 

 

ఈ నేపథ్యంలోనే సిరిసిల్లలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ముగ్గురు విద్యార్థులు పీకలదాకా తాగి రోడ్డుపై హల్ చల్ చేశారు. అప్పటికే మందుబాబులతో విసిగిపోయిన పోలీసులు వీరిని చూసి కోపాన్ని తెచ్చుకున్నారు. దీంతో ఆ ముగ్గురిని కర్రలతో ఆ నలుగురు పోలీసులు విచక్షణారహితంగా కొట్టేశారు. పాపం ఆ పోలీసులుకు ఈ సంవత్సరం బాలేదో ఏమో.. 

 

ఆ వీడియోని తీసుకెళ్లి ఎవరో సోషల్‌ మీడియాలో పెట్టారు. దీంతో ఆ వీడియో వైరల్‌ అయింది. మంగళవారం అర్ధరాత్రి సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన రాహుల్, బన్నీ, శ్యాం బైక్‌పై వచ్చి హల్ చల్ చేశారు. అక్కడే ఉన్న పోలీసులు.. వీరిని బ్రీతింగ్‌ అనలైజర్‌తో చెక్‌ చేశారు. దొరికారు చితకబాదారు. ఆ వీడియో వైరల్ అయ్యింది.. మీడియా కంట పడింది. మీడియా సైలెంట్ ఎందుకు ఉంటుంది? వైరల్ అయినా వీడియోపై వైరల్ అయ్యేలా వివిధ కోణాల్లో ఓ వంద కథనాలు రాసింది. 

 

దీంతో ఆ వీడియో, ఆ కథనాలు కాస్త ఎస్పీ రాహుల్‌ హేగ్డే కంట పడటంతో అయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులపై దాడి చేసిన నలుగురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. క్రమ శిక్షణ చర్యల కింద ఇద్దరు ఎస్‌ఐలు, కానిస్టేబుల్‌, హోంగార్డును పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు ఎస్పీ అటాచ్‌ చేశారు. ఇలా వారి కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఇప్పుడు ఇక్కడ ఎవరిది తప్పు ? మీకు ఏమైనా అర్థం అవుతుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: